ప్రముఖ ఐరిష్ నటుడు రే స్టీవెన్‌సన్ కన్నమూశారు. మే 21 ఆదివారం ఆయన కన్నుమూశారు. రే స్టీవెన్సన్ వయసు 58 సంవత్సరాలు. ఆయన థోర్, దాని సీక్వెల్ థోర్: ది డార్క్ వరల్డ్ వంటి మార్వెల్ సినిమాలలో నటించారు. రే స్టీవెన్‌సన్ మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
ప్రముఖ ఐరిష్ నటుడు రే స్టీవెన్‌సన్(Ray Stevenson) కన్నమూశారు. మే 21 ఆదివారం(Sunday) ఆయన కన్నుమూశారు. రే స్టీవెన్సన్ వయసు 58 సంవత్సరాలు. ఆయన థోర్(Thor), దాని సీక్వెల్ థోర్: ది డార్క్ వరల్డ్(The Dark World) వంటి మార్వెల్ సినిమాల(Marvel Movies)లో నటించారు. రే స్టీవెన్‌సన్ మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన పిరియాడిక్ యాక్షన్ బ్లాక్‌బస్టర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో రే స్టీవెన్‌సన్.. గవర్నర్ స్కాట్ బక్స్‌టన్ పాత్రలో నటించి బాగా పాపులర్ అయ్యాడు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఈ చిత్రమే ఆయన మొదటి భారతీయ చిత్రం(Indian Cinema).
ఆయన పూర్తి పేరు జార్జ్ రేమండ్ స్టీవెన్సన్(George Raymond Stevenson). మే 25, 1964న లిస్బన్‌లో జన్మించాడు. ఆయన తండ్రి రాయల్ ఎయిర్ ఫోర్స్ పైలట్(Airforce Pilot). ఎనిమిదేళ్ల వయసులో రే ఇంగ్లండ్(England)కు వెళ్లి అక్కడి బ్రిస్టల్ ఓల్డ్ విక్ థియేటర్ స్కూల్‌లో చేరాడు. 29 సంవత్సరాల వయస్సులో గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకున్నాడు. స్టీవెన్‌సన్ 1990ల ప్రారంభం నుండే సినిమాలలో నటిస్తూ ఉన్నారు. స్టీవెన్సన్ త్వరలో స్ట్రీమ్ అవనున్న డిస్నీ+ స్టార్ వార్స్ సిరీస్ అసోకాలో కనిపించనున్నారు. స్టీవెన్సన్ చివరి చిత్రం యాక్సిడెంట్ మ్యాన్: హిట్‌మ్యాన్ హాలిడే.