ఎడ్వర్డ్ సోన్నెన్‌బ్లిక్‌(Edward Sonnenblick).. ఈయనెవరో చాలా మందికి తెలియకపోవచ్చు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా(RRR Movie) చూసిన వారు ఇతడిని గుర్తుపడతారు. అందులో ఎడ్వర్డ్‌ పాత్రను పోషించింది ఇతనే! దక్షిణ కాలిఫోర్నియాలో పుట్టిన ఎడ్వర్డ్ సోన్నెన్‌బ్లిక్ నటన మీద అనురక్తితో, నటించాలనే ఆసక్తితో ముంబాయికి వచ్చాడు. ముంబాయిలో ఉంటున్నాడు కాబట్టి హిందీ భాష కూడా వచ్చు.

ఎడ్వర్డ్ సోన్నెన్‌బ్లిక్‌(Edward Sonnenblick).. ఈయనెవరో చాలా మందికి తెలియకపోవచ్చు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా(RRR Movie) చూసిన వారు ఇతడిని గుర్తుపడతారు. అందులో ఎడ్వర్డ్‌ పాత్రను పోషించింది ఇతనే! దక్షిణ కాలిఫోర్నియాలో పుట్టిన ఎడ్వర్డ్ సోన్నెన్‌బ్లిక్ నటన మీద అనురక్తితో, నటించాలనే ఆసక్తితో ముంబాయికి వచ్చాడు. ముంబాయిలో ఉంటున్నాడు కాబట్టి హిందీ భాష కూడా వచ్చు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో పాన్‌ ఇండియా రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ధనుష్‌ నటిస్తున్న కెప్టెన్‌ మిల్లర్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు సినిమా ప్రమోషన్‌లలో పాల్గొంటున్నారు. పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న అమెరికన్‌ నటుడు ఎడ్వర్డ్‌ సోన్నెన్‌బ్లిక్ కూడా ఇంటర్వ్యూలిస్తున్నాడు. పీరియాడిక్‌ డ్రామాగా తెరకెక్కుతున్న కెప్టెన్‌ మిల్లర్‌లో ఆయన బ్రిటిష్‌ అధికారిగా నటించాడు. తెలుగులో రాజన్న, షిర్డిసాయి, కేసరి, సామ్‌ బహదూర్‌, మణికర్ణిక వంటి సినిమాల్లో నటించాడు. లేటెస్ట్‌గా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోలీవుడ్‌ హీరోల గురించి పలు విషయాలు చెప్పాడు ఎడ్వర్డ్‌ సోన్నెన్‌బ్లిక్‌. ధనుష్‌ కాకుండా ఇంకా ఏఏ హీరోలు తెలుసు? అన్న ప్రశ్నను ఆయనను అడిగారు. అజిత్‌, సూర్య, విజయ్‌ ఫోటోలు అతడి ముందు పెట్టారు. అతడు విజయ్‌ను మాత్రమే గుర్తుపట్టాడు. 2005లోనే విజయ్‌ నటించిన చిత్రాన్ని తాను చూశానని ఎడ్వర్డ్‌ సోన్నెన్‌బ్లిక్‌ తెలిపాడు. అతనిలో మంచి టాలెంట్‌ ఉందని అప్పుడే అనుకున్నానన్నాడు. . దీంతో కోలీవుడ్‌లో విజయ్‌ ఫ్యాన్స్‌ ఈ అంశాన్ని తెగ వైరల్‌ చేస్తున్నారు. తమ హీరో రేంజ్‌ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు తెలుసు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ లెక్కన జూనియర్ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు ఎవరో ఎడ్వర్డ్‌ సోన్నెన్‌బ్లిక్‌కు తెలియదన్నమాట!

Updated On 9 Jan 2024 6:24 AM GMT
Ehatv

Ehatv

Next Story