మలయాళం(Malyalam) సినిమా పరిశ్రమలో జస్టిస్ హేమ కమిటీ(Justice hema committiee) రేపిన ప్రకంపనలు కోలీవుడ్‌కు కూడా వ్యాపించాయి.
మలయాళం(Malyalam) సినిమా పరిశ్రమలో జస్టిస్ హేమ కమిటీ(Justice hema committiee) రేపిన ప్రకంపనలు కోలీవుడ్‌కు కూడా వ్యాపించాయి. పలువురు నటీమణులు తమ చేదు అనుభవాలను బహిరంగపరుస్తున్నారు. హేమ కమిటీలాగే కోలీవుడ్‌లోనూ నడిగర్ సంఘం సిఫారసుతో ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి నటి రోహిణి(Rohini) అధ్యక్షత వహిస్తున్నారు. ఇప్పటికే ఆమెకు చాలా ఫిర్యాదులు అందాయి. ఇదిలా ఉంటే శుక్రవారం ఆమె డాక్టర్ కాంతరాజ్‌పై చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో కంప్లయింట్ చేశారు. డాక్టర్ కాంతరాజ్(Kantharaj) ఓ యూ ట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహిళా ఆర్టిస్టులపై చాలా నీచంగా మాట్లాడారు. నటీమణులందరూ వ్యభిచారులే అన్నట్టుగా మాట్లాడారు. నటీమణులు కెమెరామెన్, లైట్‌మెన్, మేకప్‌మెన్, దర్శకుడు అంటూ కోరుకునే వారందరికి ఎడ్జెస్ట్‌మెంట్ చేసుకుని సినిమాలలో ఛాన్సులు పొందుతున్నట్టుగా కాంతరాజ్ మాట్లాడాడు. నిరాధార వ్యాఖ్యలు చేసిన డాక్టర్ కాంతరాజ్‌పై తగిన చర్యలు తీసుకోవాలని రోహిణి పోలీసు అధికారులను కోరారు. అలాగే యూట్యూబ్ ఛానల్‌లోని అతడి ఇంటర్వ్యూను కూడా తొలగించాలని కంప్లయింట్‌లో పేర్కొన్నారు.