బాలీవుడ్ నటి శిల్పాశెట్టి(shilpa shetty) ఇంట్లో దొంగతనం(robbery) జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జుహులోని శిల్పాశెట్టి ఇంట్లో చోరీ జరిగినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. గత వారం నటి శిల్పాశెట్టి జుహు నివాసం నుండి కొన్ని విలువైన వస్తువులు దొంగిలించబడినట్లు ఆ అధికారి తెలిపారు.

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి(shilpa shetty) ఇంట్లో దొంగతనం(robbery) జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జుహులోని శిల్పాశెట్టి ఇంట్లో చోరీ జరిగినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. గత వారం నటి శిల్పాశెట్టి జుహు నివాసం నుండి కొన్ని విలువైన వస్తువులు దొంగిలించబడినట్లు ఆ అధికారి తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా జుహు పోలీస్ స్టేషన్‌లో(Juhu Police station) దొంగతనం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తులను దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకున్నదని, విచారణ కొనసాగుతోందని అధికారి తెలిపారు.

తన ఫిట్‌నెస్, అందంతో ఎప్పుడూ వార్త‌ల్లో ఉండే శిల్పాశెట్టి.. ఇటీవ‌లే ఇటలీలో హాలిడే ఎంజాయ్ చేస్తున్నట్లు సోష‌ల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపింది. స్విమ్‌సూట్ ధరించి, చాలా గ్లామరస్‌గా కనిపిస్తున్న ఫోటోను కూడా అభిమానుల‌తో పంచుకుంది.

Updated On 15 Jun 2023 3:11 AM GMT
Ehatv

Ehatv

Next Story