కన్నడలో వచ్చిన కాంతార(kantara) సినిమా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భాషతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరు ఈ సినిమాను చూశారు. ఇలాంటి సినిమాను మనమెందుకు చేయలేకపోతున్నామని చాలా మంది కుళ్లుకున్నారు కూడా! తక్కువ బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా గత ఏడాది అక్టోబర్‌లో విడుదలయ్యింది.

కన్నడలో వచ్చిన కాంతార(kantara) సినిమా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భాషతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరు ఈ సినిమాను చూశారు. ఇలాంటి సినిమాను మనమెందుకు చేయలేకపోతున్నామని చాలా మంది కుళ్లుకున్నారు కూడా! తక్కువ బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా గత ఏడాది అక్టోబర్‌లో విడుదలయ్యింది. కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. కర్ణాటకలోని భూత కోల(Bhutha kola) అనే ఒక ప్రాంతీయ నృత్య రూపం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.

ఇదిలా ఉంటే కాంతార పార్ట్‌ 2(kantara Part 2) సినిమాను ఎప్పుడెప్పుడు తీస్తారా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ దాదాపుగా పూర్తయ్యింది. కాంతార-2ను ఆగస్టు 27న మొదలుపెట్టనున్నట్టు కాంతార కథానాయకుడు రిషబ్‌ షెట్టి(rishab shetty) తెలిపారు. రిషబ్‌ షెట్టి దర్శకత్వంలోనే వచ్చిన ఈ సినిమాను హూంబలే ఫిల్మ్స్‌ పతాకంపై విజయ్‌ కిరంగదూర్‌ నిర్మించారు. నిజానికి ఇప్పుడు తీస్తున్నది కాంతారకు సీక్వెల్‌ కాదు.. ప్రీక్వెల్‌ అట(Pre sequal). ఈ విషయాన్ని దర్శక, నటుడు రిషబ్‌ షెట్టినే చెప్పారు.

'నిజానికి మీరు చూసింది పార్ట్‌-2 సినిమా. పార్టీ 1 వచ్చే ఏడాది రాబోతున్నది. కాంతార కథకి చాలా చరిత్ర ఉంది. దాని కోసం మరిన్ని విశేషాలను తెలుసుకునే పనిలో ఉన్నాము. పరిశోధన ఇంకా కొనసాగుతుంది. మార్చిలో ఉగాది పండగ రోజున స్క్రిప్ట్‌ రాయడం మొదలుపెట్టాను. వచ్చే ఏడాది ఈ సినిమా మీ ముందుకు వస్తుంది. త్వరలో మరిన్ని విషయాలను వెల్లడిస్తాము’ అని రిషబ్‌ షెట్టి అన్నారు. సప్తమి గౌడ, కిషోర్‌, అచ్యుత్‌ కుమార్‌, ప్రమోద్‌ శెట్టి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Updated On 15 Jun 2023 5:23 AM GMT
Ehatv

Ehatv

Next Story