కన్నడలో తీసిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ’కాంతార‘. ప్యాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా జనాలను ఒక ఊపు ఊపేసింది. చిన్న సినిమాగా 16 కోట్ల రూపాయలతో వెండి తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. రిలీజైన అన్నీ భాషల్లోనూ హిట్ ను సొంతం చేసుకోవడంతోపాటు ఆస్కార్ నామినేషన్స్ లోనూ చోటు సంపాదించింది ఈ కాంతార. ఈ సినిమా రిలీజై 5 నెలలు […]
కన్నడలో తీసిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ’కాంతార‘. ప్యాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా జనాలను ఒక ఊపు ఊపేసింది. చిన్న సినిమాగా 16 కోట్ల రూపాయలతో వెండి తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. రిలీజైన అన్నీ భాషల్లోనూ హిట్ ను సొంతం చేసుకోవడంతోపాటు ఆస్కార్ నామినేషన్స్ లోనూ చోటు సంపాదించింది ఈ కాంతార.
ఈ సినిమా రిలీజై 5 నెలలు కావస్తున్నా ఇంకా ఆడియన్స్ లో ఆ పూనకాలు తగ్గలేదు. అంతలా ఆకట్టుంది. ఆఖరికి ఓటీటీలో కూడా కాంతార ది మోస్ట్ వ్యూవ్డ్ మూవీగా నిలిచింది. ఈ మూవీతో నటుడిగా, దర్శకుడిగా రిషబ్ శెట్టి జనాల మైండ్ లో అలా ఉండిపోయారు. ఇక కాంతార-2 అంటే మీరందరూ అనుకున్నట్టు ఇది సీక్వెల్ కాదు... ప్రీక్వెల్ అంటే కాంతార కథకు ముందే ఏం జరిగిందో చెప్పడం.
కాంతారలో హీరో తండ్రి కూడా అడవుల్లో అర్ధాంతరంగా మాయమైపోతాడు. మరి ఆ కథేంటి ? ఒక ప్రాంతంలోని రాజుకు తన భూములు, గ్రామాలు, ప్రజల రక్షణ కోసం అడవి దేవతతో ఒప్పందం ఉంటుంది. అంతకంటే ముందు ఆ రాజు ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి ? ఆ రాజు మానసిక ప్రశాంతను పోగొట్టుకోవడానికి కారణాలు ఏంటి అనేది ప్రీక్వెల్ లోని కథ. ఈ ప్రిక్వెల్ కూడా ప్యాన్ ఇండియా రేంజ్ లో తీసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట.
కాంతార భారీ సక్సెస్ అందుకుంది కాబట్టి ఇప్పుడు ప్రీక్వెల్ పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. దర్శకుడు రిషబ్ శెట్టి స్టోరీ నేరేషన్ లో ఏ విధంగా మలుపు తిప్పుతాడోనని ఆడియన్స్ ఆలోచనలో పడ్డారు. అయితే మూవీ స్క్రిప్ట్ జరుగుతున్నట్లు తెలుస్తుంది. జూన్ నుంచి షూట్ స్టార్ట్ చేయనున్నారట. వచ్చే ఏడాది మూవీని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని నెటిజన్ల టాక్.