అమెరికా(America)కు చెందిన ప్రఖ్యాత నటి, టెలివిజన్ వ్యాఖ్యాత రికీ లేక్ (Ricki Lake) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తన భావాలను, అభిప్రాయాలను నెటిజన్లతో పంచుకుంటారు. తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్(Instagram handle) నుంచి అనేక స్ఫూర్తిదాయకమైన పోస్టులు పెడుతుంటారు. నిరుడు త్రోబ్యాక్ వీడియోతో ఆండ్రోజెనిక్ అలోపేసియా(Androgenetic Alopecia అనే వ్యాధిపై అంటే హెయిర్ లాస్‌పై తన 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం గురించి చెప్పారు.
అమెరికా(America)కు చెందిన ప్రఖ్యాత నటి, టెలివిజన్ వ్యాఖ్యాత రికీ లేక్ (Ricki Lake) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తన భావాలను, అభిప్రాయాలను నెటిజన్లతో పంచుకుంటారు. తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్(Instagram handle) నుంచి అనేక స్ఫూర్తిదాయకమైన పోస్టులు పెడుతుంటారు. నిరుడు త్రోబ్యాక్ వీడియోతో ఆండ్రోజెనిక్ అలోపేసియా(Androgenetic Alopecia) అనే వ్యాధిపై అంటే హెయిర్ లాస్‌పై తన 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం గురించి చెప్పారు. జుట్టు రాలే సమస్యతో చాలా సంవత్సరాలు రహస్యంగా పోరాడినట్లు ఆమె తెలిపారు. ఇప్పుడు ఆ విషయాన్ని చెబుతూ ఓ స్ఫూర్తిదాయకమైన పోస్ట్‌ను పెట్టారు. అందరి దృష్టిని ఆకర్షించారు. కాకపోతే ఆమె ఒంటిపై దుస్తులు లేకుండా ఉన్న ఫోటోను షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. బాత్‌టబ్‌లో కూర్చొని, ప్రశాంతమైన చిరునవ్వుతో, నత చేతులతో శరీర పై భాగాన్ని కప్పేసిన ఫోటో అది! ఫోటో కింద 'ఈ రోజులు నా జీవితంలో అత్యుత్తమమైనవి. 54 ఏళ్ల వయసులో కూడా యవ్వనంగా కనిపిస్తున్నా. ఆండ్రోజెనిక్ అలోపేసియాను ధైర్యంగా ఎదుర్కొన్నాను. ఇప్పుడు నా జుట్టు పదిలంగా ఉంది. ఈ ప్రదేశం ఎంతో ప్రశాంతమైనదే కాదు ప్రేమ పంచే అభిమానులు ఉన్న దేశం' అని రాసుకొచ్చారు. రికీ లేక్ పెట్టి పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన జుట్టు రాలడానికి కారణమైన ఆండ్రోజెనిక్ అలోపేసియా అనే వ్యాధితో తన మూడు దశాబ్దాల పోరాటం గురించి చెబుతూ చేసిన ఈ పోస్టుకు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. రికీ షేర్ చేసిన ఫోటోను తీసింది ఆమె భర్త రాస్ బర్నింగ్‌హమ్. లాస్టియర్ జనవరిలో రాస్ బర్నింగ్‌హమ్‌ను మూడో పెళ్లి చేసుకుంది రికీ లేక్.