ఏపీ మాజీ ముఖ్యమంత్రి , టీడీపీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పుట్టిన రోజు కావడంతో రాష్ట్రంలో ఆ పార్టీ నేతలు ఘనంగా జరుపుకుంటుున్నారు. చంద్రబాబుకు పలువురు ప్రముఖులు కూడా బర్త్ డే విషెస్ చెప్పారు. అందులో సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కాస్త డిఫరెంట్ విషెస్ చెప్తూ.. ఆయన అంతకముందే చెప్పినట్టు.. ఓ సర్ ప్రైజ్ బహుమతితో అంటే.. ఆయనపై సెటైరికల్‌గా రాసిన సాంగ్ యూట్యూబ్ (YouTube) లింక్‌ను ట్విటర్లో షేర్ చేశారు రాము.

RGV CBN Gift
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఈయన కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రెస్ అని అందరూ అంటారు. ఆయన ఏది మాట్లాడినా.. ఏది తన ట్విటర్ (twitter)లో రాసినా.. చివరి ఆయన ఏ పబ్బుకి పోయినా కాంట్రవర్సీ అవ్వక తప్పదు. అప్పుడెప్పుడులో 'కమ్మ రాజ్యంలో కడపరెడ్లు'.. కాదు.. కాదు.. 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' (Amma Rajyam Lo Kadapa Biddalu) అనే సినిమా చేశాడు రాము. అయితే అప్పట్లో ఆ సినిమాతో కాంట్రవర్సీ పర్సన్ కాస్త పొలిటికల్ కాంట్రవర్సీలకు దారి తీశాడు ఆయన. ఆ తర్వాత నుంచి ఆయన ఏది చేసినా.. అది కాస్త పొలిటికల్‌గా రంగు మార్చుకుంటుంది. అయితే రాము పర్సనల్‌గా ఏ పార్టీకి సపోర్టు చేయకపోవచ్చు కానీ.. ఆయన ఏ కాంట్రవర్సీ చేసినా.. పబ్లిసిటీకే చేస్తాడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పబ్లిసిటీ అంటే అంత పిచ్చి మరి ఆయనకు.. అదే మరి రామూ అంటే.
ఇదిలా ఉంటే ఇవాళ ఏపీ మాజీ ముఖ్యమంత్రి , టీడీపీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పుట్టిన రోజు కావడంతో రాష్ట్రంలో ఆ పార్టీ నేతలు ఘనంగా జరుపుకుంటుున్నారు. చంద్రబాబుకు పలువురు ప్రముఖులు కూడా బర్త్ డే విషెస్ చెప్పారు. అందులో సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కాస్త డిఫరెంట్ విషెస్ చెప్తూ.. ఆయన అంతకముందే చెప్పినట్టు.. ఓ సర్ ప్రైజ్ బహుమతితో అంటే.. ఆయనపై సెటైరికల్‌గా రాసిన సాంగ్ యూట్యూబ్ (YouTube) లింక్‌ను ట్విటర్లో షేర్ చేశారు రాము. ' సిక్కో సైకో' పేరుతో సాగి ఈ పాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (artificial intelligence)తో రూపొందించిందని ఆయన అన్నారు. కృత్రిమ మేధనే సాహిత్యం రాసి పాడిందని తెలిపారు.
"సీబీఎన్ జగన్ సైకో అంటాడు. ఆ సంగతి అటుంచితే.. తానే ఒక సైకో సిక్కో అని తెలుకోలేకపోతున్నాడు. అవతలి వాళ్ల వైపు ఒక వేలు చూపిస్తే.. నాలుగు వేళ్లు నీవైపు చూపిస్తాయని 40 ఏళ్ల ఇండస్ట్రీ తెలుసుకోలేకపోవడం అదృష్టపరంగా దురదృష్టం. ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో సిక్కో అనే పదానిక అర్ధం.. మెంటల్లీ డిస్టర్బ్డ్ ఏగోటో మేనియా సఫరింగ్ ఫ్రమ్ కంపల్సివ్ లైమ్ డిజార్డర్ మిక్స్ విత్ ఎల్యూజన్స్ అండ్ మల్టీప్లయిడ్ బై ఇల్యూజనేషన్స్ ఇప్పుడు ఆ సైకో సిక్కో కథ వినండి అంటూ".. ఇంట్రోతో ఈ సాంగ్ మొదలవుతుంది.
ఆ సాంగ్‌లో మొత్తం కూడా చంద్రబాబు (Chandrababu) మొదటిగా ఏ పార్టీలో ఉండేవారు.. ఆ తర్వాత ఎన్టీఆర్ హయాంలో ఏం జరిగిదనే దానిపై ఆయనపై సెటైర్స్ వేస్తూ.. పాట సాగుతుంది. ఈ సాంగ్ విన్న తెలుగు తమ్ముళ్లు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. అయితే ఇప్పుడు ఈ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ (trending)లోకి వచ్చేసింది. ఇప్పుడు ఈ సాంగ్ ఎన్నెన్ని కాంట్రవర్సీలకు దారి తీస్తుందో చూడాలి మరి.
