సిద్ధూ జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) అన్న పేరు వినగానే అప్రయత్నంగానే డీజే టిల్లు(DJ Tillu) సినిమా గుర్తుకొస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. నిర్మాతలపై కాసుల వర్షం కురిపించింది. సిద్ధూ జొన్నలగడ్డ ఓవర్‌నైట్ పాపులర్ హీరో అయిపోయారు.

Siddu Jonnalagadda
సిద్ధూ జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) అన్న పేరు వినగానే అప్రయత్నంగానే డీజే టిల్లు(DJ Tillu) సినిమా గుర్తుకొస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. నిర్మాతలపై కాసుల వర్షం కురిపించింది. సిద్ధూ జొన్నలగడ్డ ఓవర్‌నైట్ పాపులర్ హీరో అయిపోయారు. యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. డీజే టిల్లు ఇచ్చిన జోష్‌తోనే ప్రస్తుతం ఆయన టిల్లూ స్క్వైర్(Tillu Square) సినిమా తీస్తున్నారు. మల్లిక్ రామ్(Malik Ram) డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాతో పాటు ఇటీవలే సుకుమార్ ప్రొడక్షన్ హౌజ్‌లో(Sukumar Production House) ఓ సినిమా చేయబోతున్నారు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. సిద్ధూకు సంబంధించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. నందిని రెడ్డి(Nandini Reddy) దర్శకత్వంలో సిద్దూ ఓ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ చేయబోతున్నారన్నదే ఆ వార్త. సుకుమార్ ప్రొడక్షన్ హౌజ్‌లో తెరకెక్కే సినిమా కంటె ముందే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్ ఏమిటంటే ఇందులో సిద్ధూకు జంటగా సమంత(samantha) నటించబోతున్నారట. నందిని రెడ్డికి సమంత బెస్ట్ ఫ్రెండ్. ఆ చనువుతోనే సమంత సినిమాకు ఓకే చెప్పారట. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపకుంటుంది. ఈ మధ్యనే నందిని రెడ్డి దర్శకత్వం వహించిన అన్ని మంచి శకునములే సినిమా విడుదలయ్యింది కానీ ఆశించిన మేర విజయాన్ని సాధించలేకపోయింది.
