పుష్ప-2పై రాంగోపాల్ వర్మ సంచలన రివ్యూ ఇచ్చారు. భారతీయ చిత్రాలలో ఇలాంటి పాత్రలు ఉండటం చాలా అరుదు.
పుష్ప-2పై రాంగోపాల్ వర్మ సంచలన రివ్యూ ఇచ్చారు. భారతీయ చిత్రాలలో ఇలాంటి పాత్రలు ఉండటం చాలా అరుదు. ఒక స్టార్ స్వయంగా తన సొంత ఇమేజ్‌ను విస్మరించి అరుదైన క్యారెక్టర్‌లో ఒదిగిపోవడం చాలా అరుదు. పుష్ప వంటి పాత్రను చూడటం చాలా అరుదైన సంఘటనలలో ఒకటని.. ఒక ప్రేక్షకుడిగాగా నేను పుష్ప(Pushpa) వంటి పాత్ర నిజంగా ఉంటుందని నమ్మాను. కమర్షియల్ మెయిన్ స్ట్రీమ్ ఫార్మాట్‌లో క్యారెక్టర్‌ను ఉంచడం అంత సులభం కాదు. పుష్ప పాత్రలో చాకచక్యంతో కూడిన అమాయకత్వం, వలనరబులిటితో కూడిన సూపర్ ఇగో వంటివి కనిపిస్తాయి.
ఈ వ్యక్తి ఇంత సూపర్ యాక్షన్ హీరో అవుతాడని నేను ఎప్పుడూ నమ్మలేదన్నారు. కానీ పుష్ప పాత్రలో అల్లుఅర్జున్(Allu Arjun) తనకున్న వైకల్యాన్ని అధిగమించి శక్తివంతమైన వ్యక్తిగా మారారని ఆర్జీవీ(RGV) అన్నారు. మునుపెన్నడూ చూడని బాడీ లాంగ్వేజ్, హావభావాలు పాత్రకు మరింత బలాన్ని అందించాయి. ఈ పాత్ర కొన్ని దశాబ్దాలపాటు ప్రేక్షకుల మదిలో నిండి ఉంటుందన్నారు. కొన్ని అవాస్తవిక సన్నివేశాలు కూడా నిజమైనవిగా అనిపించేంత అల్లు అర్జున్ నటించారు. దీంతో క్యారెక్టర్‌ను సినిమా హైప్‌కు తీసుకెళ్లిందా.. క్యారెక్టరే సినిమాకు హైప్ ఇచ్చిందానేది చెప్పడం చాలా కష్టమని వర్మ అన్నారు. అల్లు అర్జున నటన ఒక్క బాడీ లాంగ్వేజ్‌తోనే అగిపోలేదు, అతని లోతైన భావోద్వేగాలు స్పష్టంగా ముందుకు తీసుకెళ్తాయి. తనతో ఫొటో దిగేందుకు ముఖ్యమంత్రి నిరాకరించడంతో బహుశా ఈ క్యారెక్టర్‌కు ఇగో అడ్డు వచ్చి ఉంటుంది. పుష్ప క్యారెక్టర్‌ను చాలా ఎంజాయ్ చేశానని ఆర్జీవీ అన్నారు.