గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ గేమ్ ఛేంజర్.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ గేమ్ ఛేంజర్. ఈరోజు (జనవరి 10) ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయిన ఈసినిమా ఎలా ఉంది..? మెగా ఫ్యాన్స్ అనుకున్నంత అద్భుతంగా వచ్చిందా..? అంచనాలు అందుకోగలిగిందా..? ఈసినిమా రివ్యూ ఒక్క సారి చూసుకుంటే..?

రామ్ చరణ్ హీరోగా.. కియారా అద్వాని, అంజలి, శ్రీకాంత్, సునిల్, సముద్రఖిని, జయరాం, ఎస్ జే సూర్య, రాజీవ్ కనకాల లాంటి స్టార్ కాస్ట్ తో తెరకెక్కింది సినిమా. ఇక ఈసినిమా కథ విషయానికి వస్తే.. రామ్ నాధ్ ( రామ్ చరణ్) ఐఏఎస్ చదివి విశాఖపట్నం కలెక్టర్ గా వస్తాడు. అక్కడ జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై ఉక్కుపాదం మోపుతుంటాడు. అదే సమయంలో తాను గతంలో ఐపీఎస్ కూడా చదివినట్టు తెలుస్తుంది. తన ప్రియురాలు దీపిక( కియారా అద్వాని) కోరిక మేరకు ఐపీఎస్ అవుతాడు చరణ్. విడిపోయిన తన ప్రేమికురాలితో మళ్లీ కలుస్తాడు. ఈక్రమంలో పొలిటికల్ గాఎదగాలని చూస్తున్న మోపిదేవి( ఎస్ జే సూర్య.) తన తండ్రి సత్యమూర్తి ని చంపేస్తాడు. కాని తాను సీఎం అవ్వకుండా రామ్ చరణ్ అడుగడుగా అడ్డు పడతాడు. ఈక్రమంలోనే తన తల్లి పార్వతమ్మ ( అంజలి) అని. తన తండ్రి ఉద్యమకారుడు అప్పన్న ( రామ్ చరణ్ డ్యూయల్ ) అని తెలుసుకుంటాడు. ఈక్రమంలో సత్యమూర్తి చనిపోతూ.. రామ్ ను సీఎంగా ప్రకటిస్తాడు. అసలు ఏం సబంధం లేని కలెక్టర్ రామ్ ను సత్యమూర్తిసీఎం గా ఎందుకు ప్రకటించాడు..? ముఖ్యమంత్రి సత్యమూర్తికి, మరణించిన అప్పన్నకు సంబంధం ఏంటి..? తండ్రి మరణించిన తరువాత పార్వతమ్మ ఏం చేసింది. తన తండ్రి ఉద్యమకారుడు కావడంతో అతని మరణం రహస్యం గురించి రామ్ చరణ్ కు తెలిసింది ఏంటి..? ముఖ్యమంత్రి కావాలి అని కలలు కంటున్న మోపిదేవిని రామ్ చరణ్ ఎలా అడ్డుకున్నాడు..? అతని కుట్రల నుంచి ఎలా బయటపడ్డాడు అనేది సినిమా.

ఇక ఈసినిమా ఎలా ఉంది అంటే.. సినిమా కథ రొటీన్.. పాత్రలు రొటీన్. సాధారణ లోకల్ పొలిటికల్ స్టోరీతో పాన్ ఇండియా రేంజ్ లో సినిమాను చేయాలి అనుకోవడం ఏంటో అర్ధం కావడంలేదు. ఈసినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో చిన్న స్థాయిలో.. చిన్న బడ్జెట్ తో చేసుకుంటే చాలా బాగుండేది. కాని పాన్ ఇండియా రేంజ్ లో హైప్ ఇచ్చి.. తుస్సుమనిపించారనిపిస్తుంది. మరీ ముఖ్యంగా స్క్రీన్ ప్లే అస్సలు బాగోలేదు. అసులు ఏ సీన్ ఎప్పుడు ఎలా వస్తుందో అర్ధం కాదు. కొన్నిసన్నివేశాలు అసలు లింకే లేకుండా చూపించారు. శంకర్ నుంచి ఇటువంటి స్క్రీన్ ప్లేన్ అస్సలు ఎక్స్ పెక్ట్ చేసి ఉండరు. రామ్ చరణ్ అప్పన్న కొడుకు అయితే.. అతన్ని పెంచిన తండ్రి నరేష్.. ఆయన దగ్గరకు రామ్ చరణ్ ఎలా వచ్చాడు అనేది తెలియదు. ఎంట్రీ సీన్ లో తప్పించి మళ్లీ తన తల్లీ తండ్రులు కనిపించరు. హీరోయిన్ తండ్రి ఏమయ్యాడో తెలియదు. వెన్నెల కిషోర్ పాత్ర ఎందుకు పెట్టారో తెలియదు. అంతకు మించి చెప్పాలి అంటే.. రామ్ చరణ్ హీరోయిన్ ను ప్రేమించింది మెడిసిన్ చదువుకునేప్పుడు. మెడిసిన్ చదివిన రామ్ చరణ్ ఆతరువాత ఐపీస్ ఎస్ అయ్యి.. తరువాత ఐఏఎస్ అవుతాడు. ఇది వింటానికి ఒక రకంగా ఉంది. ఇలాంటివి ఈసినిమా నుంచి చాలా బయటకు తీయ్య వచ్చు. మొత్తానికి ఈ సినిమా నుంచి చాలా లాజిక్ లు మిస్ అయ్యారు అనిపిస్తుంది. ఈసినిమాలో పాన్ ఇండియా స్టాండెట్స్ ఎక్కడా కనిపించలేదు అనే చెప్పాలి. ఇక సినిమా మొత్తానికి జరగండి సాంగ్ మాత్రం అద్భుతంగా ఉంది. శంకర్ మార్క్ మేకింగ్ కనిపించింది. ఆడియన్స్ నుఈ సాంగ్ విజువల్స్ మెస్మరైజ్ చేశాయి.

ఇక నటీనటుల విషయానికి వస్తే... రామ్ చరణ్ తన నటనతో మెప్పించాడు. కాని డైరెక్టర్ కు రామ్ చరణ్ ను ఎలా ఉపయోగించుకోవాలో తెలియలేదు అది స్పస్టంగా కనిపిస్తోంది. చరణ్ నటనకు వంకలు పెట్టడానికి లేదు. చరణ్ డాన్స్ కు కూడా వంకలు పెట్టలేము. కాని ఈ సినిమాలో రామ్ చరణ్ చేత మంచి స్టెప్పులు వేయించలేకపోయారు. ఈరకంగా మెగా ఫ్యాన్స్ కు కాస్త నిరాశే మిగిలింది. ఇక కియారా అద్వాని తన పాత్ర పరిది మేరకు బాగా నటించింది. కాని ఆమెకు స్క్రీన్ స్పేస్ తక్కువే అని చెప్పాలి. ఇక సునిల్ తో సైడ్ సుందరంగా పాత్ర చేయించారు కాని.. అనుకున్నంత కామెడీ పండించలేకపోయారు. సీనియర్ నటుడు నరేష్ ఒక్క సీన్ లో మాత్రమే కనిపిస్తాడు. కమెడియన్ సత్య, వెన్నెల కిషోర్ కూడా ఓ రెండు సీన్లు అంతే.. వారి యాక్టింగ్ ఎలా ఉంది అని చెప్పడానికి కూడా అంత స్పేస్ లేదు వారికి.

ఇక విలన్ గా ఎస్ జే సూర్య పాత్ర మాత్రం అద్భుతం అని చెప్పాలి. ఒక రకంగా ఈసినిమాకు హీరో రేంజ్ పెర్ఫామెన్స్ ఇచ్చింది ఎస్ జే సూర్యనే. సూర్య తరువాత స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉన్నది అంజలికే. సెకండ్ పార్ట్ అంతా అంజలి నటన అద్భుతం. రామ్ చరణ్ తరువాత సినిమా మొత్తానికి సూర్య, అంజలి నటనే అద్భుతం అని చెప్పాలి. ఇక శ్రీకాంత్ కూడా తన పరిదిమేర నటించాడు. సముద్ర ఖని పాత్ర పరిమితంగాకనిపించింది. పెద్దగా యాక్టింగ్ స్కోప్ లేదు. ఇక జయం రవి, రాజీవ్ కనకాల, నవీన్ చంద్ర, రచ్చ రవి, ఇలా మిగిలిన నటులు తమ పాత్ర పరిదిమేరకు బాగానే నటించారు.

ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే.. డైరెక్టర్ శంకర్ కు ఏమయ్యింది అర్ధం కావడంలేదు. ఇండస్ట్రీలో ఇన్నాళ్ళ నుంచి ఉన్నఅతను ఇప్పుడు వస్తున్న సినిమాలను చూసి కూడా రామ్ చరణ్ ఇమేజ్ ను కరెక్ట్ గా క్యారీచేయలేకపోయాడేమో అనిపిస్తుంది. కార్తీక్ సుబ్బరాజ్ ఇచ్చిన కథ పరమ రొటీన్. ఈసినిమా అంతో ఇంతో బాగుంది అంటే తమన్ అందించిన సంగీతం మూలంగానే. ఈసినిమా మ్యూజిక్ అద్భుతం అని చెప్పాలి. ప్రతీ పాట అలరించింది. పాటల విజ్యువలైజేషన్ కూడా అద్భుతంగా ఉంది. కాని రామ్ చరణ్ తో ఓ రెండు స్టెప్పులు ఎక్కువగా వేయించాల్సింది. పాటలన్నీ సూపర్ సక్సెస్ అయ్యింది. వివేక్ అందించిన స్క్రీప్ ప్లే మాత్రం పేలవంగా ఉంది. స్క్రీన్ ప్లే విషయంలో శంకర్ కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. ఇక ఓవర్ ఆల్ గా ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేంత లేదు. పాన్ ఇండియా రేంజ్ లో భారీ కలెక్షన్లు సాధించడం కష్టమనే చెప్పాలి. సంక్రాంతి సీజన్ కావడంతో ఓ మోస్తరు కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఒక్క సారి చూడదగిని సినిమానే. యావరేజ్ అని చెప్పవచ్చు.

ehatv

ehatv

Next Story