తమన్ ఆవేదనపై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్

ఇటీవల సోషల్ మీడియా చూస్తుంటే ఇరిటేషన్ వస్తుందని.. భయమేస్తుందని సంగీత దర్శకుడు తమన్ ఆవేదన చెందారు. మొత్తం నెగిటివిటినే. సినిమా నచ్చకపోతే చెప్పండి కానీ ఇలా నెగిటివిటి చేసి ఏం సాధిస్తారని డాకు మహారాజ్ సక్సెస్ మీట్‌లో తమన్ ఎంతో ఆవేదనతో మాట్లాడాడు. తమన్ మాటలపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్‌గా ట్వీట్ చేశారు. తమన్ మాట్లాడిన మాటలు హృదయాన్ని తాకేలా ఉన్నాయన్నారు. మనసు ఎంత కలత చెందితే అంతలా మాట్లాడాడు అనే విషయం అర్థమవుతోందని చిరంజీవి అన్నారు. చిరంజీవి ట్వీట్‌లో '' నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ వుండే నీలో ఇంత ఆవేదన వుండడం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అని అనిపించింది. విషయం సినిమా అయినా క్రికెట్ అయినా మరో సామజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరు తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా వుంటుందని ఆలోచించాలి. ఎవరో అన్నట్టు మాటలు ఫ్రీ నే, Words can inspire. And Words can destroy. Choose what you wish to do. మనం పాజిటివ్ గా వుంటే ఆ ఎనర్జీ మన జీవితాలని కూడా అంతే పాజిటివ్ గా ముందుకు నడిపిస్తుంది. Thoughtful words my dear ! God Bless !'' అంటూ రాసుకొచ్చారు.
