లైలా సినిమాపై వైసీపీ శ్రేణుల ఆగ్రహం చల్లారలేదు.

లైలా సినిమాపై వైసీపీ శ్రేణుల ఆగ్రహం చల్లారలేదు. విశ్వక్‌సేన్‌పై ఎలాంటి కోపం లేదంటూనే పృథ్వీ వ్యాఖ్యలపై గరంగరంగా ఉన్నారు. సోషల్‌ మీడియాలో లైలా సినిమాపై నెగిటివ్ ట్రోల్స్‌ నడుస్తూనే ఉన్నాయి. నిన్నటివరకు బాయ్ కాట్ లైలా ట్రెండ్ నడవగా.. రాత్రి నుంచి డిజాస్టర్ లైలా అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. లైలా సినిమా ఫంక్షన్‌లో నటుడు పృథ్వీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. వైసీపీనుద్దేశించి వ్యాఖ్యలు చేశాడని పృథ్వీని టార్గెట్‌ చేశారు. రాజకీయాలకు, సినిమాలకు సంబంధం లేదంటూనే ఆయన సినీ వేదికను వాడుకున్నారు. ఆ ప్రభావం విశ్వక్ సేన్ సినిమాపై గట్టిగా పడింది. విశ్వక్‌సేన్‌ కూడా క్షమాపణలు కోరారు.. పృథ్వీ లైన్లోకి వచ్చారు. తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నానని, ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమాపణ చెప్తున్నానని వీడియో రిలీజ్ చేశారు. ఇకపై బాయ్ కాట్ లైలా అనకుండా వెల్ కం లైలా అనాలని, సినిమాను పెద్ద హిట్ చేయాలని పిలుపునిచ్చారు. అయితే పృథ్వీపై చాలామందికి ఇంకా కోపం చల్లారలేదు. దీంతో ఈరోజు రిలీజైన లైలా సినిమాపై “డిజాస్టర్ లైలా” అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఇలా తీవ్ర వ్యతిరేకత మధ్య ఈరోజు లైలా సినిమా థియేటర్లలోకి వచ్చింది. వైసీపీ గట్టిగా పట్టున్న ప్రాంతాల్లో థియేటర్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

ehatv

ehatv

Next Story