☰
✕
x
ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ అభిమాని హత్యకేసులో ప్రధాన అనుమానితుల్లో ఒకరైన పవిత్ర గౌడకు దర్శన్ స్నేహితుడు మాత్రమేనని.. అతడి భార్య కాదని దర్శన్ తరపు న్యాయవాది అనిల్‌బాబు స్పష్టం చేశారు. చిత్రదుర్గకు చెందిన 33 ఏళ్ల రేణుకస్వామిని హత్య చేసిన ఆరోపణలపై దర్శన్, పవిత్ర గౌడ, మరో 14 మందిని అరెస్టు చేశారు. పవిత్ర గౌడ దర్శన్ తూగుదీప రెండవ భార్య లేదా భాగస్వామి అని సూచించే వార్తలను నిర్ద్వంద్వంగా ఖండించారు. విజయలక్ష్మి నటుడి చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భార్య అని, పవిత్ర గౌడ కేవలం సహనటి, స్నేహితురాలు మాత్రమేనని ఆయన అన్నారు.
“పవిత్ర గౌడ రెండో భార్య అన్నది పూర్తిగా అబద్ధం. ఆమె కేవలం స్నేహితురాలు మాత్రమే. వారు సహనటులు. ఇప్పుడు స్నేహపూర్వక సంబంధం కలిగి ఉన్నారు. దర్శన్ ఏకైక భార్య విజయలక్ష్మి. ఏ సమయంలోనూ రెండో పెళ్లి జరగలేదు" అని అనిల్‌బాబు తెలిపారు. రేణుకాస్వామితో దర్శన్‌కు ఎలాంటి సంబంధం లేదని, ఈ హత్యతో సంబంధం లేదని బాబు అంటున్నారు. నేరం జరిగిన ప్రదేశానికి సమీపంలో దర్శన్ కారు ఉన్నట్లు చూపుతున్న సీసీటీవీ ఫుటేజీని ప్రస్తావించగా.. ఆ సమయంలో దర్శన్ కారులో లేడని, అక్కడ అతను ఉన్నట్లు రుజువు చేసే ఎలాంటి ఆధారాలు పోలీసులు అందించలేదని బాబు మీడియాతో అన్నారు.
Eha Tv
Next Story