పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై మండిపడింది... ఆయన మాజీ భార్య రేణు దేశాయ్. ఇప్పటికే చాలా ఓపిక పట్టాను..ఇక నావల్ల కాదంటూ చెలరేగిపోయింది రేణు. ఇంతకీ పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ కి అంత కోపం ఎందుకు వచ్చింది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యింది... ఆయన మాజీ భార్య.. మాజీ హీరోయిన్ రేణుదేశాయ్. మా అన్నకొడుకును అప్పుడప్పుడైనా చూపించండి అని అడిగిన అభిమానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది రేణు. మీ అన్న కొడుకు కాదు.. నా కొడుకు .. వాడు నా బిడ్డ అంటూ మండి పడింది రేణు. ముందు మాట్లాడే పద్దతి నేర్చుకోండి.. ఆతరువాత ఇలా అడగండీ అంటూ నిప్పులు చెరిగారు రేణు దేశాయ్.
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై మండిపడింది... ఆయన మాజీ భార్య రేణు దేశాయ్. ఇప్పటికే చాలా ఓపిక పట్టాను..ఇక నావల్ల కాదంటూ చెలరేగిపోయింది రేణు. ఇంతకీ పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ కి అంత కోపం ఎందుకు వచ్చింది.
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యింది... ఆయన మాజీ భార్య.. మాజీ హీరోయిన్ రేణుదేశాయ్. మా అన్నకొడుకును అప్పుడప్పుడైనా చూపించండి అని అడిగిన అభిమానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది రేణు. మీ అన్న కొడుకు కాదు.. నా కొడుకు .. వాడు నా బిడ్డ అంటూ మండి పడింది రేణు. ముందు మాట్లాడే పద్దతి నేర్చుకోండి.. ఆతరువాత ఇలా అడగండీ అంటూ నిప్పులు చెరిగారు రేణు దేశాయ్.
అసలు ఇంతకీ ఏం జరిగిందంటే.. పవర్ స్టార్, రేణు దేశాయ్ గారాల తనయుడు అకీరానందన్ పుట్టిన రోజు సందర్భంగా శనివారం సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది రేణు. వీడాకులు తీసుకుని ఎవరికి వారు విడిగా ఉండటంలో.. అఖీరా తన తల్లి దగ్గరే ఉంటున్నాడు. ఇక ఈ సందర్భంగా పోస్ట్ పెట్టిన రేణు.. 19 ఏళ్లు వచ్చినా అకీరా నాకు ఇప్పటికీ పసిబిడ్డేనని అందులో రాసుకొచ్చారు. దీంతో అకీరాకు వరుసగా బర్త్ డే విషెష్ వెల్లువలా వచ్చి పడ్డాయి. ఇందులో పవర్ అభిమానులు కూడా అకీరాను విష్ చేశారు రకరకాల కామెంట్లు చేశారు.
ఈసందర్భంగా సన్నిహితులతో పాటు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అకీరాకు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్లు పెట్టారు. అయితే, ఓ అభిమాని పెట్టిన కామెంట్ పై రేణుదేశాయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.మేడమ్.. ఇది చాలా అన్యాయం. మా అకీరా బాబును ఒక్కసారి అయినా చూపించండి మా అన్న పవన్ కల్యాణ్ కొడుకును చూడాలని మాకు ఉంటుంది. దయచేసి మీరు హైడ్ చేయకండి.. అని ఓ అభిమాని ఇన్ స్టాలో మెసేజ్ చేశాడు. అకీరా బాబును అప్పుడప్పుడైనా వీడియోల్లో చూపించండని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. దీనిపై రేణుదేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక వెంటనే కోపంతో ఊగిపోయిన రేణూ దేశాయ్... ఆ కామెంట్ చేసిన అభిమానికి ఘాటుగా సమాధానం చెప్పింది. మీ అన్న కొడుకా? అకీరా నా కొడుకు. మీరు ఒక తల్లికి పుట్టలేదా. మీరు హార్డ్ కోర్ ఫ్యాన్స్ అని నాకు తెలుసు. అయినా సరే మీరు మాట్లాడే పద్థతి నేర్చుకోవాలి. మీ అభిమానం నేను అర్థం చేసుకుంటున్నా కాబట్టే చాలావరకు మౌనంగా ఉంటున్నాను. కాని ఇలా ఉంటే ఇంకా రెచ్చి పోతున్నారు. ఇష్టం వచ్చినట్టు..హద్దులు మీరి కామెంట్లు చేస్తున్నారు. నా కొడుకు బర్త్ డే రోజు కూడా నాకు మనశ్శాంతి లేకుండా నెగెటీవు కామెంట్లు పెడుతున్నారు అని బాధపడ్డారు.
అంతే కాదు ఇలా నన్ను ఇబ్బంది పెడుతున్నా.. నన్ను ఒక చెడ్డదానిలా చూస్తున్నా సరే పదకొండేళ్లుగా భరిస్తున్నా.. కానీ ఇప్పుడు ఓ తల్లిగా ఈ విషయాన్ని భరించలేకపోతున్నా.. చాలా హర్ట్ అవుతున్నా. ఇలాంటి వారితో విసిగెత్తిపోయాను. అసలు ఈ జనాల సమస్య ఏంటనేది నాకు అర్థం కావడంలేదు అంటూ రేణు దేశయ్ ఆవేశంతో కూడిన ఆవేదనను వ్యక్తం చేశారు. దాంతో సోషల్ మీడియాలో ఇది వైరల్ అయ్యింది. చాలా మంది రేణూదేశాయ్ కు సపోర్ట్ చేస్తూ.. కామెంట్లు చేస్తున్నారు.