టాలీవుడ్ నటి రేణు దేశాయ్‌ను పవన్‌కల్యాణ్ అభిమానులు ఇంకా వేపుకు తింటూనే ఉన్నారు. ఆమెను ట్రోల్ చేసి అవమానిస్తున్నారు.
మీకూ తల్లి, చెల్లి ఉంటారని గుర్తుపెట్టుకోండి. .. రేణు స్ట్రాంగ్ వార్నింగ్‌టాలీవుడ్ నటి రేణు దేశాయ్(Renu Desai)ను పవన్‌కల్యాణ్ అభిమానులు(Pawan Kalyan Fans) ఇంకా వేపుకు తింటూనే ఉన్నారు. ఆమెను ట్రోల్ చేసి అవమానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) నుంచి విడిపోయిన తర్వాత రేణు దేశాయ్‌కి ఫ్యాన్స్ నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. సినిమాకు దూరంగా ఉంటున్నా సోషల్ మీడియా(Social Media) ద్వారా అభిమానులతో తన అభిరుచులను పంచుకుంటుంటారు. తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టినా పవన్ ఫ్యాన్స్ చెత్త కామెంట్లు పెడుతూ ఆమెకు బాధ కలిగిస్తుంటారు. తన వ్యక్తిగత జీవితంలోకి పవన్‌ను తీసుకురాకండి అని రేణు దేశాయ్ ఎన్నిసార్లు వేడుకున్నా వారు మాత్రం మారడం లేదు. రేణు దేశాయ్ ఎలాంటి పోస్ట్ పెట్టినా దాని కింద కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. చాలాసార్లు వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఫలితం లేకుండా పోతున్నది. లేటెస్ట్‌గా మరోసారి తన ఆవేదనను పంచుకున్నారు రేణు దేశాయ్. పవన్ ఈ మధ్య తన భార్య లెజినోవాతో పాటు, పిల్లలు అకీరానందన్, ఆద్యతో సరదగా ఒక ఫొటో దిగారు. ఆ ఫోటో కాస్తా వైరల్ అయ్యింది. ఆ ఫోటోను ఉపయోగించి కొందరు మీమర్స్ రేణును అవమానించేలా మీమ్స్ రూపొందించారు. వీటిపై రేణు దేశాయ్ భావోద్వేగంతో ఓ పోస్ట్ పెట్టారు. 'కొందరిని చూస్తుంటే అసహ్యం వేస్తుంది. ఈ ఫొటోను నేను ఎలా క్రాప్ చేసి పోస్ట్ చేస్తానని ఆవేదన వ్యక్తం చేసింది. మీకూ ఒక ఫ్యామిలీ ఉందని గుర్తుంచుకొండి. తన తల్లిని ఎగతాళి చేస్తున్న పోస్టులను చూసి నా కూతురు విపరీతంగా ఏడ్చింది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కుటుంబ సభ్యులపై కామెంట్స్ చేసే ముందు మీకూ ఇంట్లో తల్లి, అక్కాచెల్లెళ్లు, కూతుర్లు ఉంటారన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇలాంటి మీమ్ పేజీలు నిర్వహించేవారు భయంకరమైన వ్యక్తులు. ఈ రోజు నా కూతురు ఎంతో బాధ అనుభవించింది. ఆమె కన్నీళ్లు కర్మ రూపంలో మిమ్మల్ని వెంటాడుతాయి. పొలినా, మార్క్(లెజినోవా పిల్లలు) సైతం ఇలాంటి విచక్షణ లేని కామెంట్లు, మీమ్స్‌తో ప్రభావితం అవుతారు. ఈ పోస్టు చేయడానికి వందలసార్లు ఆలోచించాను. నా కూతురు కోసం, ఆమె అనుభవించిన బాధను దృష్టిలో పెట్టుకుని ఈ పోస్టు చేస్తున్నాను అంటూ రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.