Renu Desai : అప్పుడూ ఇప్పుడూ పవన్ గురించి నేను నిజమే చెప్పాను... రేణు దేశాయ్
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్(Pawan kalyan) మాజీ భార్య రేణు దేశాయ్(Renu desai) సోషల్ మీడియాలో(Social media) యాక్టివ్‌గా ఉంటారు. ప్రస్తుతం ఆమె ట్రెండింగ్‌లో ఉన్నారు. కొద్ది రోజుల కిందట తన విడాకుల విషయం గురించి, పవన్ కల్యాణ్ గురించి చాలా చెప్పారు. దీంతో రేణు దేశాయ్‌ను టార్గెట్ చేస్తూ కొందరు సోషల్ మీడియా ద్వారా కామెంట్లు పెడుతున్నారట! ఈ విషయం రేణునే స్వయంగా చెప్పారు. లేటెస్ట్‌గా ఈ వివాదంపై రేణు దేశాయ్ స్పందించారు.
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్(Pawan kalyan) మాజీ భార్య రేణు దేశాయ్(Renu desai) సోషల్ మీడియాలో(Social media) యాక్టివ్‌గా ఉంటారు. ప్రస్తుతం ఆమె ట్రెండింగ్‌లో ఉన్నారు. కొద్ది రోజుల కిందట తన విడాకుల విషయం గురించి, పవన్ కల్యాణ్ గురించి చాలా చెప్పారు. దీంతో రేణు దేశాయ్‌ను టార్గెట్ చేస్తూ కొందరు సోషల్ మీడియా ద్వారా కామెంట్లు పెడుతున్నారట! ఈ విషయం రేణునే స్వయంగా చెప్పారు. లేటెస్ట్‌గా ఈ వివాదంపై రేణు దేశాయ్ స్పందించారు. ' నా విడాకుల విషయంలో నా మాజీ భర్త ఎలా మోసం చేశాడనే వాస్తవాన్ని గతంలో చెప్పినప్పుడు ఆయన అభిమానులు(Fans) చాలా దారుణంగా అశ్లీల పదాలతో తిట్టారు. ఇప్పుడు దేశ పౌరురాలిగా(Citizen) నేను పవన్‌కు అనుకూలంగా కొన్ని మాటలు మాట్లాడినప్పుడు అతడిని ద్వేషించేవారు నన్ను దుర్భాషలాడుతున్నారు.
విడాకుల(Divorce) విషయంలో నా మాజీ భర్త గురించి అప్పుడు నేను మాట్లాడింది నిజం. ఆ రోజు అలా మాట్లాడినందుకు కొందరి నుంచి డబ్బు తీసుకున్నానని పవన్ అభిమానులు ఆరోపించారు. అంతే కాకుండా సోషల్ మీడియా ద్వారా నన్ను దూషించారు కూడా. ఇప్పుడు కూడా మళ్లీ అలాంటిదే నా విషయంలో జరుగుతోంది. నా మాజీ భర్తకు అనుకూలంగా ఉండే వ్యక్తులు నాకు డబ్బు ఇచ్చారని కొందరు ఆరోపిస్తున్నారు. ఇందులో ఏ మాత్రం నిజం లేదు. నా మాజీ భర్త గురించి నేను అప్పుడు, ఇప్పుడు రెండు సందర్భాలలో నిజమే చెప్పాను. అతనితో ప్రేమలో పడి నిజం మాట్లాడినందుకు నేను చెల్లించాల్సిన మూల్యం ఇదేనని అనుకుంటున్నాను. ఇది నా విధి అయితే అలాగే ఉండనీయండి. దయచేసి నన్ను తిట్టకండి' అని రేణు దేశాయ్ విజ్ఞప్తి చేశారు. దీంతో ఆమె చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.