ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి పాపం రేణూ దేశాయ్ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఆంధ్రప్రదేశ్(AP)లో ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి పాపం రేణూ దేశాయ్ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ చేష్టలను ఆమె భరించలేకపోతున్నారు. ఇదే విషయాన్ని ఆమె చాలాసార్లు పవన్ ఫ్యాన్స్‌కు మర్యాదగా చెప్పారు. అయినా వారిలో కొంచెం కూడా మార్పు రాలేదట! మొన్నటి ఎన్నికల్లో పవన్ కల్యాణ్ విజయం సాధించడంతో ఆయన అభిమానులు రేణూదేశాయ్ ఇన్‌స్టాగ్రామ్ కామెంట్ బాక్స్‌లో చెత్త చెత్త మెసేజ్‌లు పెడుతున్నారు.
రేణు దురదృష్టవంతురాలని వారు చేసిన కామెంట్ ఆమెను ఎంతగానో బాధించింది.
అటువంటి మెసేజ్‌లు తనకు చాలా బాధ కలిగిస్తున్నాయని, తనను అలా అనకూడదని చెప్పి చెప్పి అలసిపోతున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ నుంచి విడాకులు తీసుకున్నప్పట్నుంచి ఆయన ఫ్యాన్స్‌తో రేణు దేశాయ్ పెద్ద యుద్ధమే చేస్తున్నారు. ఒకానొక టైమ్‌లో కామెంట్ సెక్షన్ కూడా హైడ్ చేసుకోవాల్సి వచ్చింది. ఇంత జరుగుతున్నా పవన్ తన ఫ్యాన్స్‌కు అడ్డుకట్ట వేయడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదని, అభిమానులకు చిన్న సూచన కూడా చేయలేదని రేణు బాధపడ్డారు. లేటెస్ట్‌గా మరోసారి తన ఇన్‌స్టాగ్రామ్ కామెంట్ల సెక్షన్‌ను క్లోజ్ చేస్తున్నానని రేణు చెప్పారు. ఆమె ఏం చెప్పారంటే.. 'ఇప్పటి నుంచి నా ఇన్‌స్టాగ్రామ్ కామెంట్ సెక్షన్‌ను ఆఫ్ చేస్తున్నాను. కారణమేమిటంటే నా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లలో దరిద్రపు కామెంట్లు పెట్టే మూర్ఖులు, వెధవలకు తిరిగి సమాధానం ఇచ్చే అంత ఓపిక నాకు లేదు. అంతే కాకుండా వాటిని ఎదుర్కొనే అంత భావోద్వేగం నాకు లేదు. నేను బాధలో ఉన్నప్పుడు కొన్నేళ్లుగా నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ నా ధన్యవాదాలు. నన్ను ద్వేషించేవారికి ఒకటే చెబుతున్నా.. కర్మ అనేది ఒకటుందనే విషయాన్ని మరిచిపోకండి. అది ఎప్పటికీ కామ్‌గా ఉండదు. తప్పకుండా మీ కోసం తిరిగి వస్తుంది.' అంటూ రేణు దేశాయ్ పోస్ట్ చేశారు. దీంతో పాటు ఓ కొటేషన్‌ను కూడా షేర్ చేశారు. దాని అర్థమేమిటంటే 'మీరు చూస్తున్నది అంతా సమస్య కాదని ఏదో ఒకరోజు తెలుసుకుంటారు. అవును, మీరు తప్పు చేస్తున్నారు. ఎందుకంటే మీరు కూడా మనుషులే కదా..! ఆ తప్పుల నుంచి ఎదుగుతాం కదా.. ప్రేమతో మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల మీ మనసుల్ని గాయపరిచే అవకాశం ఈ ప్రపంచానికి ఇవ్వకండి' అని! 'మీరు దురదృష్టవంతురాలు మేడమ్' అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేస్తున్న పవన్ ఫ్యాన్స్‌కు రేణూ దేశాయ్ కౌంటర్ ఇస్తూ 'నేను ఎలా దురదృష్టవంతురాలినో చెప్పండి' అని అంటూనే.. 'నేను ఆయన్ను (పవన్) వదిలేయలేదు.. ఆయనే నన్ను వదిలేశారు' అని ఘాటుగా రిప్లై ఇచ్చారు. 'నా భర్త నన్ను వదిలేసి, వేరే పెళ్లి చేసుకుంటే అది నా తప్పు ఎందుకు అవుతుంది..? కొన్నేళ్లుగా ఇలాంటి కామెంట్లతో యుద్ధమే చేస్తున్నాను. అలాంటి మాటలు విని నాకు విసిగొస్తుంది. నా అదృష్టాన్ని కేవలం ఒక వ్యక్తితో మీరందరూ ఎందుకు ముడిపెడుతున్నారు..? విడాకులు తీసుకున్నRenu Desai Got Emotional About Trolls For Labeling Her As Unluckyవారు ఎవరూ దురదృష్టవంతులు కాదని తెలుసుకుంటే చాలు.' అని రేణూ దేశాయ్ చెబుతూ ఆ స్క్రీన్ షాట్‌లను కూడా ఆమె పంచుకున్నారు.పవన్ వేరే పెళ్లి చేసుకుంటే నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నారు.. రేణూ దేశాయ్ భావోద్వేగం!