వరుణ్‌తేజ్(Varun Tej)-లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) పెళ్లికి తాను వెళ్లకపోవడానికి కారణాలేమిటో రేణూ దేశాయ్(Renu Desai) వివరించారు. ఒకవేళ తాను ఆ పెళ్లికి హాజరైతే అందరూ అసౌకర్యంగా ఫీలవుతారని, అందుకే వెళ్లడం లేదని చెప్పారు. లేటెస్ట్‌గా తాను నటించిన టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswar Rao) సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను తెలిపారు.

Renu Desai
వరుణ్‌తేజ్(Varun Tej)-లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) పెళ్లికి తాను వెళ్లకపోవడానికి కారణాలేమిటో రేణూ దేశాయ్(Renu Desai) వివరించారు. ఒకవేళ తాను ఆ పెళ్లికి హాజరైతే అందరూ అసౌకర్యంగా ఫీలవుతారని, అందుకే వెళ్లడం లేదని చెప్పారు. లేటెస్ట్‌గా తాను నటించిన టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswar Rao) సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను తెలిపారు. వరుణ్ తన ముందే పెరిగాడని, తన ఆశీస్సులు అతడికి ఎప్పుడూ ఉంటాయని రేణూదేశాయ్ తెలిపారు. నిహారిక(Niharika) వివాహానికి కూడా తాను వెళ్లలేదని, పిల్లలను పంపించానని తెలిపిన రేణు ఒకవేళ వరుణ్ పెళ్లికి వెళితే అసౌకర్యంగా ఫీలవుతారని అన్నారు. వరణ్‌తేజ్-హీరోయిన్ లావణ్యలది ప్రేమ వివాహం అన్న విషయం తెలిసిందే. నవంబర్ 1వ తేదీన ఇటలీలో వీరిద్దరి పెళ్లి జరగనుంది. ఇప్పటికే వరుణ్, లావణ్యల కుటుంబాలు, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, ఉపాసన ఇటలీకి వెళ్లారు. మరోవైపు ఈ వివాహ వేడుకలు ఇప్పటికే మొదలయ్యాయి. ఇక అక్కడి నుంచి తిరిగి వచ్చాక నవంబర్ 5వ తేదీన సినీ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో రిసెప్షన్ నిర్వహించనున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత నటిగా టైగర్ నాగేశ్వరరావుతో రీ ఎంట్రీ ఇచ్చారు రేణూ దేశాయ్. రవితేజ హీరోగా దర్శకుడు వంశీ తెరకెక్కించిన ఈ సినిమాలో ఆమె సంఘ సంస్కర్త గుర్రం జాషువా కుమార్తె హేమలతా లవణం పాత్ర పోషించారు.
