కమలహాసన్‌(Kamal haasan)- శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన భారతీయుడు(Indian) సినిమా ఓ సంచలనం!

కమలహాసన్‌(Kamal haasan)- శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన భారతీయుడు(Indian) సినిమా ఓ సంచలనం! పెద్ద హిట్టయ్యింది. అయితే దానికి సీక్వెల్‌గా తీసిన భారతీయుడు 2(Indian 2) మాత్రం ఘోరంగా ఫ్లాప్‌ అయ్యింది. జులై 12న థియేటర్లలో వచ్చిన ఈ సినిమా కొద్ది రోజులకే నెట్‌ఫ్లిక్స్‌లోకి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అక్కడ కూడా జనాలు ఆదరణ లభించలేదు. ఈ సినిమాను చూసిన రేణు దేశాయ్‌ మూవీ టీమ్‌పై మండిపడ్డారు. ఇలాంటి సినిమాలు ఫ్లాప్‌ అయినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అందుకు కారణమేమిటంటే ఈ సినిమాలో వీధికుక్కలను చాలా హీనంగా చూసే ఓ డైలాగు ఉండటమేనట! ఆ క్లిప్పింగ్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో షేర్‌ చేశారు రేణు దేశాయ్‌. ' తెలివితక్కువ రచయితలు ఇలాంటి డైలాగ్స్‌ ఎలా రాస్తారు? అసలు వాళ్లకు ఏమైంది?' అని ఆగ్రహం చెందారు.

Eha Tv

Eha Tv

Next Story