ప్రతి ఏడాది సూపర్‌స్టార్‌ కృష్ణ ఇప్పటికీ మన మధ్య ఉన్నట్టుగానే ఉంది! ఆయన పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రెట్‌ చేస్తున్నట్టుగానే ఉంది. ఆయన లేరంటే నమ్మశక్యంగా అనిపించడం లేదు. తెలుగు ఇండస్ట్రీని అంతగా ప్రభావితం చేశారాయన! నిజంగానే తెలుగు సినీ పరిశ్రమంలో ఆయనో సాహసి. కదిలే బొమ్మలను మరింత వేగంగా కదిలించిన ఘనుడు. విజయాలకు పొంగిపోని వినమ్రుడు. అపజయాలకు వెరవని ధీరోధాత్తుడు. హీరో అంటే కృష్ణనే! ఆయనే నిర్వచనం. మరొకరిని అది అంతగా నప్పదు. జెమ్స్‌బాండ్‌ అన్నా, గూఢచారి అన్నా, కౌబాయ్‌ అన్నా, అసాధ్యుడన్నా, అఖండుడన్నా ఆయనే! తెలుగు ప్రేక్షకులకు కొత్తదనాన్ని పరిచయం చేయడంలో ఎప్పుడూ ముందుండేవారు! అందుకే కృష్ణంటే అందరికి అంత ఇష్టం!
మనిషి జీవితంలో ఆటుపోట్లు, ఉత్థాన పతనాలు సహజం. ఆనంద విషాదాలు సర్వ సాధారణం. ఆశ నిరాశల దాగుడు మూతలు అనివార్యం. వీటన్నింటినీ ఎదుర్కొని నిలవగలవాడే సాహసి. ఈ గుణగణాలన్నీ ఉన్నాయి కాబట్టే కృష్ణ సాహసి అయ్యారు. సాహసాన్ని మారుపేరుగా మార్చుకున్నారు.

Updated On 31 May 2023 5:02 AM GMT
Ehatv

Ehatv

Next Story