దసరా సెలవులకు ఈ రెండు సినిమాలలో ఒకటి వచ్చేలా ప్లాన్ చేస్తే బెటర్ అని అభిమానులు

SS రాజమౌళి దర్శకత్వం వహించిన RRR సినిమా విడుదలై 2 సంవత్సరాలు అయింది. ఆయన అభిమానులు ఎన్టీఆర్‌ను పెద్ద స్క్రీన్‌పై చూసింది అప్పుడే. అయితే ఆచార్యలో రామ్ చరణ్ కనిపించాడు. ఈ సినిమా తరువాత.. తారక్, చరణ్ ఇద్దరూ దేవర, గేమ్ ఛేంజర్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు ఈ ఏడాది చివర్లో విడుదల కానున్నాయి. అయితే ఈ సినిమాలు ఎప్పుడు విడుదలవుతాయనే దానిపై భారీ ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ OG విడుదల తేదీ అధికారికంగా ప్రకటించేశారు. సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. అల్లు అర్జున్ పుష్ప 2 ఆగష్టు 15 న రానుంది. శంకర్ ఇండియన్ 2 సినిమా వచ్చాక కానీ.. గేమ్ ఛేంజర్ సినిమా విడుదలవ్వడం లేదు. ఇక దేవరను ఏప్రిల్ లో ఎంజాయ్ చేద్దామని అభిమానులు అనుకుంటూ ఉండగానే వాయిదా ప్రకటన అభిమానులకు షాకింగ్ గా మారింది. దీంతో అభిమానులను అన్నేసి రోజులు వెయిటింగ్ చేయించడం నిజంగా ఆలోచించాల్సిన విషయమే!!

దసరా సెలవులకు ఈ రెండు సినిమాలలో ఒకటి వచ్చేలా ప్లాన్ చేస్తే బెటర్ అని అభిమానులు కోరుకుంటూ ఉన్నారు. దేవరను దసరా సెలవుల లోపు తీసుకుని రావాలనే చిత్ర యూనిట్ కూడా భావిస్తూ ఉంది. అయితే ఈ రిలీజ్ విండో మిస్ అయితే మాత్రం గేమ్ ఛేంజర్ క్రిస్మస్ కు రావాల్సి ఉంటుంది. రెండు సినిమాలు ఒకే విధమైన సమస్యను ఎదుర్కొంటూ ఉన్నాయి. దేవర, గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్లు వచ్చేస్తే అభిమానుల్లో కూడా ఓ టెన్షన్ తగ్గిపోతుంది.

Updated On 6 Feb 2024 10:07 PM GMT
Yagnik

Yagnik

Next Story