చేసిన నాలుగు సినిమాలు వరుసగా హిట్ అవ్వడంతో జోరు మీద ఉంది సంయుక్తా మీనన్(samyuktha menon). ప్రస్తుతం టాలీవుడ్‌లో సంయుక్త జపం చేస్తున్నారు మేకర్స్.. ఆమె పట్టిందల్లా బంగరమే అన్నట్లు.. తెలుగులో ఆమె లక్కీ హీరోయిన్ అయిపోయింది. గోల్డెన్ లెగ్(Golden leg) అంటూ పేరు పడిపోయింది సంయుక్తాకు.

చేసిన నాలుగు సినిమాలు వరుసగా హిట్ అవ్వడంతో జోరు మీద ఉంది సంయుక్తా మీనన్(samyuktha menon). ప్రస్తుతం టాలీవుడ్‌లో సంయుక్త జపం చేస్తున్నారు మేకర్స్.. ఆమె పట్టిందల్లా బంగరమే అన్నట్లు.. తెలుగులో ఆమె లక్కీ హీరోయిన్ అయిపోయింది. గోల్డెన్ లెగ్(Golden leg) అంటూ పేరు పడిపోయింది సంయుక్తాకు. ఇక రీసెంట్ గా సాయి ధరమ్ తేజ్(Sai dharam tej) జంటగా విరూపాక్షతో(virupaksha) ఈ మలయాళ బ్యూటీ తిరుగులేని విజయం సాధించింది. అందం, నటనతో పాటు మంచి మనసున్న వ్యక్తిగానూ సంయుక్త మీనన్‌ నిలిచిపోయింది. ఇక తన మంచి మనసు ఏంటో రీసెంట్ గా అందరికి తెలిసింది.

తాజాగా తెలుగులో ఓ రియాల్టిషోలో పాల్గొన్న సంయుక్త ఇద్దరు స్టూడెంట్స్‌కు మర్చిపోలేని గిఫ్ట్‌లను ఇచ్చింది. విరూపాక్ష టీమ్‌తో కలిసి సంయుక్త మీనన్‌ తాజాగా సిక్స్త్‌ సెన్స్‌(sixth sense) రియాలిటీ షోలో పాల్గొంది. కాగా అన్ని టాస్క్‌లు గెలిస్తే స్కూటీ ఇస్తామని ఓంకార్‌(Omkar) చెప్పాడు. అయితే విరూపాక్ష టీమ్‌ మాత్రం తాము ఆ స్కూటీని గెలిస్తే అక్కడున్న స్టూడెంట్స్‌లో ఎవరికో ఒకరికి ఇచ్చేస్తాం అని అన్నారు. అనుకున్నట్టుగానే ఆ గేమ్ ను వారు గెలిచి చూపించారు. దాంతో తాను గెలుచుకున్న స్కూటీని.. సంయుక్త మీనన్‌ అక్కడున్న స్టూడెంట్స్‌లో ఇద్దరిని సెలక్ట్‌ చేసి అందులో ఒకరికి స్కూటీని ఇచ్చేసింది.

అంతే కాదు అక్కడితో ఆగలేదు.. అక్కడ ఉన్న మరో అమ్మాయికి తాను స్వయంగా స్కూటీ కొనిస్తానని మాట ఇచ్చింది సంయుక్తా మీనన్. ఇక సంయుక్తా మంచి మనసుకు.. ఇద్దరు విద్యార్ధునులు హగ్‌ చేసుకుని థాంక్స్ కూడా చెప్పారు. ఇక ఇది చూసిన నెటిజన్లు .. బ్యూటీ విత్‌ గోల్డెన్ హార్ట్‌ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. టావుడ్ లో సంయుక్తా మీనన్ చాలా స్పెషల్ అనిపించుకుంటుంది. తన స్పెషాలిటీ చూపించుకుంటుంది.

అంతెందుకు ఆమధ్య విరూపాక్ష మూవీ థియేటర్ లో చూడటానికి వెళ్ళిన టీమ్ లో దర్ధకుడు కార్తీక్ దండు(Karthik dandu) ఫోన్ ను ఎవరో కొట్టేశారు. దాంతో అతనికి వెంటనే ఐఫోన్‌ బహుమతిగా ఇచ్చింది. ఇక సంయుక్త ప్రస్తుతం డెవిల్‌ సినిమా చేస్తుంది. కళ్యాణ్ రామ్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటుంది. ఇక విరూపాక్షతో సంయుక్తకు మంచి క్రేజ్‌ వచ్చింది. ఈ సినిమాతో నటిగా ఓ మెట్టు ఎక్కింది. ఇప్పటికే 70 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ సినిమా .. 1‌00 కోట్లు టార్గెట్ గా పరుగెడుతోంది.

Updated On 1 May 2023 4:58 AM GMT
Ehatv

Ehatv

Next Story