డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన (Uppena) సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది కృతి శెట్టి. పంజా వైష్ణవ్ తేజ్ సరసన నటించి ఓవర్ నైట్‏ టాలీవుడ్‏లో సెన్సేషనల్ హీరోయిన్‏గా మారిపోయింది ఈ బ్యూటీ. ఈ చిత్రంతో ఆమెకు మాసివ్ ఫ్యాన్‏బేస్ అండ్ అలాగే స్టార్ డమ్‏ని తీసుకొచ్చింది.

డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన (Uppena) సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది కృతి శెట్టి. పంజా వైష్ణవ్ తేజ్ సరసన నటించి ఓవర్ నైట్‏ టాలీవుడ్‏లో సెన్సేషనల్ హీరోయిన్‏గా మారిపోయింది ఈ బ్యూటీ. ఈ చిత్రంతో ఆమెకు మాసివ్ ఫ్యాన్‏బేస్ అండ్ అలాగే స్టార్ డమ్‏ని తీసుకొచ్చింది. అయితే తన అభిమానులు కోరుకున్నట్టు కృతి శెట్టి కెరీర్ ఆ రేంజ్‏లో మాత్రం లేదు. బేమమ్మ మంచి పెర్ఫామెన్స్ చేసినప్పటికీ ఆ సినిమాలు బాక్సాఫీసు దగ్గర కూలబడటంతో ఆమె కెరీర్‏పై తీవ్ర ప్రభావం చూపింది. ఇక నితిన్, నాని, రామ్ పోతినేని, నాగచైతన్య వంటి యంగ్ హీరోలతో క్రేజీ ప్రాజెక్టుల్లో భాగమైంది ఈ బ్యూటిఫుల్ కీర్తి. ‘ఉప్పెన’ సినిమాతో ఒక్కసారిగా పాపులారిటీ రావడంతో ఈ బ్యూటీ వరుసగా వచ్చిన అవకాశాలన్నిటినీ అందిపుచ్చుకుంది.

ఇక ‘శ్యామ్ సింగ రాయ్’ (Shyam Singha Roy) సినిమాలో నేచురల్ స్టార్ నాని సరసన హీరోయిన్‏గా కృతి శెట్టి నటించింది. తాజాగా బేబమ్మ మాట్లాడుతూ.. తాను చేసిన క్యారెక్టర్‏తో ఇబ్బందులుపడినట్టు చెప్పింది. తనకు కంఫర్టబుల్‏గా అనిపించే సినిమాలు ఒప్పుకోవడం, చేయడం నేర్చుకున్నానని.. శ్యామ్ సింగ రాయ్ సినిమాలో తాను కీర్తి క్యారెక్టర్‏కు న్యాయం చేయలేకపోయానని తెలిపింది. అయితే ఆ సినిమాలో నానితో ఇంట్రడక్షన్ సీన్‏లో ఈ భామ మనకు కనిపించింది. ఇదిలా ఉంటే ఆమె నటించిన నితిన్ మాచెర్ల నియోజకవర్గం (Macherla Niyojakavargam), రామ్ పోతినేని దివారియర్ (The Warriorr), రీసెంట్ రిలీజ్ అయిన కస్టడీ (Custody) చిత్రాలు ఆమె ఆశించినంతగా గుర్తింపు తీసుకురాలేదు. ఇదిలా ఉంటే ఆ మధ్య సుధీర్ బాబు-ఇంద్రగంటి మోహన్ కృష్ణ కాంబినేషన్‏లో వచ్చిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ (Aa Ammayi Gurinchi Meeku Cheppali) చిత్రం కూడా నిరాశే మిగిల్చింది.

బేబమ్మకు సరైన టర్నింగ్ పాయింట్ రావాలంటే.. హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతల కాంబినేషన్ల ఫార్ముల కాకుండా.. విభిన్నమైన క్యారెక్టర్లు చేయాలని.. మేకోవర్‏పై కూడా దృష్టి పెట్టాలని ఇటు ప్రేక్షకులు, అటు ఆమె అభిమానులు సూచిస్తున్నారు. అయితే పెర్ఫామెన్స్‏పరంగా ఈ బ్యూటీ బానేగా రానిస్తున్నప్పటికీ.. స్టార్ హీరోలు, ఫేమస్ డైరెక్టర్ల హై బడ్జెట్ సినిమాల్లో పార్ట్ అవడమే ఆమె కెరీర్‏కు ఏ మాత్రం కలిసిరావడంలేదని ఇంకొందరు అంటున్నారు. ఈ కన్నడ బ్యూటీ ఇప్పటి వరకు దాదాపు 10 సినిమాలలో తన నటనతో ఆకట్టుుకుంది. తాజాగా మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) సరసన నటించేందుకూ సిద్దమైంది మన బేబమ్మ. ఇక ఇప్పటికే ఈ బ్యూటీ తమిళం, మలయాళం సినిమాలకు కమిట్ అయింది. దీంతో ప్రస్తుతం ఆమె చేతిలో కొత్త ప్రాజెక్టులు ఏమీ లేవు. ప్రెజెంట్ సెట్స్ మీద ఉన్న మలయాళ చిత్రానికి ‘అజయంతే రందం మోషనం’ (Ajayante Randam Moshanam) అనే టైటిల్‏ను ఖరారు మూవీ మేకర్స్.

Updated On 15 May 2023 5:13 AM GMT
Ehatv

Ehatv

Next Story