సామజవరగమన(samajavaragamana) సినిమాతో హీరోయిన్‌గా నటించిన రెబా మోనికా జాన్(Rebba Mounika John) అందరి దృష్టిని ఆకర్షించారు. శ్రీ విష్ణుకు జంటగా నటించిన ఈమె సినిమాలో బాగా నవ్వించారారు. తెలుగులో నటించాలనే కోరిక తనకు ఎప్పట్నుంచో ఉండేదని, సామజవరగమనతో ఆ కోరిక నెరవేరిందని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తెలుగు సినిమాలో అద్భుతాలు చేస్తున్నాయని, ఇలాంటి తరుణంలో తాను పరిశ్రమలో భాగం కావడం తన అదృష్టమని రెబా మోనికా జాన్ అన్నారు.

Reba Monica John
సామజవరగమన(samajavaragamana) సినిమాతో హీరోయిన్‌గా నటించిన రెబా మోనికా జాన్(Reba Monica John) అందరి దృష్టిని ఆకర్షించారు. శ్రీ విష్ణుకు జంటగా నటించిన ఈమె సినిమాలో బాగా నవ్వించారారు. తెలుగులో నటించాలనే కోరిక తనకు ఎప్పట్నుంచో ఉండేదని, సామజవరగమనతో ఆ కోరిక నెరవేరిందని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తెలుగు సినిమాలో అద్భుతాలు చేస్తున్నాయని, ఇలాంటి తరుణంలో తాను పరిశ్రమలో భాగం కావడం తన అదృష్టమని రెబా మోనికా జాన్ అన్నారు.
సామజవరగమన సినిమా విడుదలయ్యాక తన జీవితం చాలా బాగుందని, అల్లు అర్జున్(allu Arjun), రవితేజతో(Raviteja) పాటు చాలా మంది హీరోలు, దర్శకులు తన నటనను మెచ్చుకుంటూ సందేశాలు పంపించారని తెలిపారు. వారిచ్చిన ప్రోత్సాహం తనకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు. అందం, నటన, డాన్స్, కామెడీ .. ఇలా అన్ని సమతూకంలో ఉన్న పాత్ర దొరకడం అంత ఈజీ కాదని, అయితే తెలుగులో మొదటి సినిమాలోనే అవన్నీ చేసే అరుదైన అవకాశం తనకు లభించిందని చెప్పారు.
శ్రీవిష్ణు, రామ్ అబ్బరాజుతోపాటు చిత్రబృందం ఇచ్చిన సహకారంతో తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని, అందుకే ప్రేక్షకుల నుంచి అంత మంచి స్పందన లభించిందని అన్నారు. 'సామజవరగమనలో నాకు అనుకోకుండా అవకాశం లభించింది. పవన్‌కల్యాణ్(Pawan Kalyan), సాయిధరమ్ తేజ్(Saidharam Tej) కలిసి నటించిన బ్రో(BRO) సినిమా కోసమని హైదరాబాద్‌కి వచ్చినప్పుడు అనుకోకుండా నిర్మాత రాజేశ్ దండా ఆఫీస్‌కి వెళ్లాను. అక్కడ రామ్ అబ్బరాజు నన్ను చూసి కథ చెప్పారు. ఆ వెంటనే ఎంపిక చేశారు. హీరో శ్రీవిష్ణు అంతకు కొన్ని నెలల ముందే ఓ సినిమా కోసం నన్ను సంప్రదించాలని ప్రయత్నించారట. కానీ నేను తెలుగులో నటించడం లేదని ఎవరో చెప్పడంతో ఆగిపోయారట.
చివరికి విధి ఈ సినిమాలో భాగం అయ్యేలా చేసిందన్నమాట. ఏదో ఒక రోజు పవన్‌కల్యాణ్, సాయిధరమ్ తేజ్‌లతో కలిసి నటిస్తాననే నమ్మకం ఉంది' అని రెబా మోనికా జాన్ అన్నారు.'తెలుగు సినిమాలే నా లక్ష్యం. తొలి సినిమాతో అంత ప్రభావం చూపించాక.. రెండో సినిమా కీలకం. తదుపరి ఎలాంటి చిత్రం చేస్తానా అని ఎదురు చూస్తున్నారు. మరో మంచి ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రావడమే నా టార్గెట్. విజిల్‌లో అనితగా గుర్తుండిపోయే పాత్ర చేశాను . మంచి కథ అనుకుంటే వాణిజ్య ప్రధానమైన కథలైనా సరే, డీ గ్లామర్ పాత్రలైనా సరే చేయడానికి నేను సిద్ధం. వ్యక్తిగతంగా నాకు యాక్షన్ సినిమాలంటే ఇష్టం. యాక్షన్ ప్రధానంగా సాగే ఓ మంచి పాత్ర చేయాలనే కోరిక ఉంది. తెలుగు భాష నేర్చుకుంటున్నా. తదుపరి సినిమాకి సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటాను' అని రెడా మోనికా జాన్ అన్నారు.
