సినిమా వాళ్ళకి సెంటిమెంట్లు ఎక్కువే. అలాంటి సెంటిమెంట్లలో గోదావరి(Godhavari) ఒకటి. గోదావరి తీరం లో సినిమా తీస్తే, ఆ సినిమా హిట్ అవుతుందని చాలామందికి సెంటిమెంట్. తెలుగే కాదు హిందీ సినిమాలు సైతం గోదావరి తీరంలో షూటింగ్ చేసి హిట్స్ కొట్టారంటే సినిమా వాళ్ళకి గోదావరి సెంటిమెంట్ ఎంత బలంగా ఉందొ ఇట్టే అర్ధం చేసుకోవచ్చు.

సినిమా వాళ్ళకి సెంటిమెంట్లు ఎక్కువే. అలాంటి సెంటిమెంట్లలో గోదావరి(Godhavari) ఒకటి. గోదావరి తీరం లో సినిమా తీస్తే, ఆ సినిమా హిట్ అవుతుందని చాలామందికి సెంటిమెంట్. తెలుగే కాదు హిందీ సినిమాలు సైతం గోదావరి తీరంలో షూటింగ్ చేసి హిట్స్ కొట్టారంటే సినిమా వాళ్ళకి గోదావరి సెంటిమెంట్ ఎంత బలంగా ఉందొ ఇట్టే అర్ధం చేసుకోవచ్చు.

‘మూగమనసులు’(Mugamanasulu) నుంచి ‘రంగస్థలం’(Rangasthalam) వరకూ గోదావరి బ్యాక్ డ్రాప్ లో ఎన్నో హిట్లు, ఇక గోదావరి తో పాటు గోదావరి గట్టునే ఉండే చెట్టు(Tree) అంటే కూడా సినిమావాళ్ళకి మరో సెంటిమెంట్. ఆ చెట్టు కింద ఏకంగా 300 సినిమాల షూటింగ్ జరిగిందంటే మీరు నమ్ముతారా. నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే ఆ చెట్టు మహిమ అలాంటిది మరి.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం లో కుమారదేవం గ్రామ గోదావరి ఒడ్డున ఉంది ఈ సినిమా చెట్టు. మావిడి చెట్టు, కొబ్బరి చెట్టు ఉంటుంది కానీ ఈ సినిమా చెట్టు ఏంటి అనుకుంటున్నారా? అదేనండి అక్కడికే వస్తున్నా, గోదావరి గట్టునుండే ఈ నిద్రగన్నేరు చెట్టుకింద సినిమా తీస్తే, ఆ సినిమా హిట్ అని నమ్మకం. నమ్మకమే కాదు, ఇది చాలా సినిమాల్లో నిజం కూడా అయింది. అందుకే అదే సెంటిమెంట్ తో ఈ చెట్టు కింద ఏకంగా 300 సినిమాలు తీశారు.

సినిమావాళ్ళకి ఈ చెట్టు సెంటిమెంట్ ఎంతగా అంటే మొత్తం సినిమాలో ఒక్క షాట్ అయినా ఈ చెట్టుకింద పెడితే, లేదా చెట్టుపై ఒక్క షాట్ తీసినా ఆ సినిమా హిట్ అనేంతవరకు సెంటిమెంట్ పెంచుకున్నారు.

మొదటిసారిగా 1964లో మూగమనసులు(Mugamanasulu) సినిమాలోని ఒక పాటని ఇక్కడ చిత్రీకరించడంతో అప్పటి నుంచి ఇది సెంటిమెంట్ గా మారింది . అక్కడనుంచి 1975 లో కృష్ణ నటించిన పాడిపంటలు సినిమా తో నిన్నటి రంగస్థలం వరకు ఈ సినిమా చెట్టు కింద షూటింగ్ చేసి హిట్ కొట్టిన వాళ్లే.

గోదావరి తీరం, అందులోను సినిమా చెట్టు గురించి మాట్లాడుకుంటూ పసలపూడి వంశీ ని టచ్ చెయ్యకపోతే అది అసంపూర్తిగా ఉంటుంది. గోదావరి లొకేషన్స్ ని అక్కడి యాసని, జీవన విధానాన్ని వంశీ చూపించినంతగా మరెవరు చూపించలేదనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే గోదావరి- వంశీ అంత మమేకమైపోయారు. వంశీ తీసిన మాక్సిమం సినిమాల్లో ఈ చెట్టు పరిసర ప్రాంతాల్లో తీసినవే. అంతెందుకు ఇప్పటికి ఆయన అటువైపుగా వెళ్తే ఆ చెట్టుకింద కూర్చుని భోజనం చేస్తారు.

చూసారుగా ఈ సినిమా చెట్టుకున్న హిస్టరీ, సెంటిమెంటు. దాదాపు 300 సినిమాల షూటింగ్ జరుపుకున్న ఈ చెట్టుని ఎప్పుడో 150 ఏళ్ల క్రితం తాతబ్బాయి అనే అయన నాటాడట, అప్పటినుంచి ఇప్పటివరకు ఆ చెట్టుని కుమారదేవం ప్రజలు సంరక్షించుకుంటూ వస్తున్నారు.

Updated On 11 July 2023 4:39 AM GMT
Ehatv

Ehatv

Next Story