బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌(Bigg Boss Season 7) చూస్తున్న ప్రేక్షకులకు అర్థం కాని విషయం ఒకటుంది. కిరణ్‌ రాథోడ్‌ను(Kiran Rathore) హౌస్‌లోకి ఎందుకు తీసుకొచ్చారో, పట్టుమని వారం రోజుల్లోనే ఇందుకు ఇంటి నుంచి వెళ్లగొట్టారో తెలియక బుర్ర గోక్కుంటున్నారు. కిరణ్‌ రాథోడ్‌కు తెలుగు అస్సలు రాదని తెలిసి కంటెస్టెంట్‌గా ఎందుకు ఎంపిక చేశారో బిగ్‌బాస్‌ నిర్వాహకులకే తెలియాలి. ఎలిమినేషన్‌కు(elimination) గురవ్వడానికి ఆమె చేసిన తప్పులు కూడా కొన్ని ఉన్నాయి. మొత్తంగా వారానికే కిరణ్‌ రాథోడ్‌ హౌస్‌ నుంచి బయటకు వచ్చేశారు. తెలుగులో అందరూ దొంగలే దొరికితే, భాగ్యలక్ష్మి బంపర్‌డ్రా , హైస్కూల్‌, కెవ్వు కేక వంటి సినిమాల్లో నటించిన కిరణ్‌రాథోడ్‌ 2016లో ఓ తమిళ సినిమాలో నటించారు. అది తెలుగులో భాజాభజంత్రీలు పేరుతో విడుదలయ్యింది. ఆ తర్వాత సినిమాల్లో ఆమె నటించలేదు. ఆమెను ప్రేక్షకులు మర్చిపోయి చాన్నాళ్లే అయ్యింది.

బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌(Bigg Boss Season 7) చూస్తున్న ప్రేక్షకులకు అర్థం కాని విషయం ఒకటుంది. కిరణ్‌ రాథోడ్‌ను(Kiran Rathore) హౌస్‌లోకి ఎందుకు తీసుకొచ్చారో, పట్టుమని వారం రోజుల్లోనే ఇందుకు ఇంటి నుంచి వెళ్లగొట్టారో తెలియక బుర్ర గోక్కుంటున్నారు. కిరణ్‌ రాథోడ్‌కు తెలుగు అస్సలు రాదని తెలిసి కంటెస్టెంట్‌గా ఎందుకు ఎంపిక చేశారో బిగ్‌బాస్‌ నిర్వాహకులకే తెలియాలి. ఎలిమినేషన్‌కు(elimination) గురవ్వడానికి ఆమె చేసిన తప్పులు కూడా కొన్ని ఉన్నాయి. మొత్తంగా వారానికే కిరణ్‌ రాథోడ్‌ హౌస్‌ నుంచి బయటకు వచ్చేశారు. తెలుగులో అందరూ దొంగలే దొరికితే, భాగ్యలక్ష్మి బంపర్‌డ్రా , హైస్కూల్‌, కెవ్వు కేక వంటి సినిమాల్లో నటించిన కిరణ్‌రాథోడ్‌ 2016లో ఓ తమిళ సినిమాలో నటించారు. అది తెలుగులో భాజాభజంత్రీలు పేరుతో విడుదలయ్యింది. ఆ తర్వాత సినిమాల్లో ఆమె నటించలేదు. ఆమెను ప్రేక్షకులు మర్చిపోయి చాన్నాళ్లే అయ్యింది. మళ్లీ సినిమాల్లోకి రావాలని తెగ ప్రయత్నిస్తున్నారామె! బిగ్‌బాస్‌లో వచ్చిన అవకాశాన్ని వాడుకోవాలనుకున్నారు. బిగ్‌బాస్‌లో కనిపించగానే ఆఫర్లు తన్నుకుని వస్తాయనుకున్నారు. కొండంత ఆశతో బిగ్‌బాస్‌లో అడుగుపెట్టారు. కానీ తెలుగు రాకపోవడం ఆమెకు మైనసయ్యింది. తెలుగు రాదనే సాకుతో హౌస్‌మేట్స్‌ ఆమెను నామినేట్‌ చేశారు. కిరణ్‌ కూడా హౌస్‌లో తెలుగులో తప్ప మిగతా భాషల్లోనే మాట్లాడారు. తెలుగు రాకపోయేసరికి మిగతావారితో కలవలేకపోయారు. కుస్తీ పోటీలో మాత్రం కాస్త యాక్టివ్‌గా కనిపించిన కిరణ్‌ మిగతా సమయాల్లో మాత్రం డల్‌గా కనిపించారు. పెద్దగా టాస్క్‌లు జరగలేదు కాబట్టి తన ప్రతిభాపాటవాలను ప్రేక్షకులకు చూపించే అవకాశం లేకుండాపోయింది. ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్‌ కాకపోవడంతో ఓట్లు కూడా పడలేదు. అందరికంటే తక్కువ ఓట్లు కిరణ్‌కే పడ్డాయి. దాంతో ఎలిమినేట్‌ అయ్యారు. పాపం తనకు తాను నిరూపించుకునే అవకాశం కిరణ్‌కు ఇవ్వలేదు బిగ్‌బాస్‌. సోషల్‌ మీడియాలో కిరణ్‌ టీమ్‌ కూడా ఆమెకు మేలు చేసే బదులుగా కీడే ఎక్కువగా చేసింది. కిరణ్‌ అసభ్య వీడియోలు, ఫోటోలు ఆమె టీమ్‌ షేర్‌ చేస్తూ మరింత కంటెంట్‌ కోసం యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోమని ప్రచారం చేసింది. ఇది కిరణ్‌కు లాభం కంటే నష్టమే ఎక్కువ తెచ్చింది. హౌస్‌లో ఆమె ఉన్నది వారం రోజులే అయినా డబ్బులు మాత్రం బాగానే ముట్టాయి. రోజుకు 45 వేల రూపాయల చొప్పున వారం రోజులకు కిరణ్‌ రాథోడ్‌ మూడు లక్షల రూపాయల పై చిలుకు రెమ్యునరేషన్‌ అందుకున్నారు.

Updated On 11 Sep 2023 5:45 AM GMT
Ehatv

Ehatv

Next Story