సూపర్ సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనుష్క షెట్టి(Anushka Shetty) ఆరంభంలో హీరోలతో ఆడిపాడే హీరోయిన్ల పాత్రలకే పరిమితమయ్యింది. అరుంధతి(Arundathi) సినిమా ఆమె ఇమేజ్‌ను పూర్తిగా మార్చేసింది. ఈ సినిమా తర్వాత అనుష్క గ్లామర్ పాత్రలలో నటించడం మానేశారు. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లోనే నటిస్తున్నారు. అభిమానులు కూడా ఆమెను గ్లామర్ పాత్రలలో ఊహించుకోవడం మానేశారు.
సూపర్ సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనుష్క షెట్టి(Anushka Shetty) ఆరంభంలో హీరోలతో ఆడిపాడే హీరోయిన్ల పాత్రలకే పరిమితమయ్యింది. అరుంధతి(Arundathi) సినిమా ఆమె ఇమేజ్‌ను పూర్తిగా మార్చేసింది. ఈ సినిమా తర్వాత అనుష్క గ్లామర్ పాత్రలలో నటించడం మానేశారు. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లోనే నటిస్తున్నారు. అభిమానులు కూడా ఆమెను గ్లామర్ పాత్రలలో ఊహించుకోవడం మానేశారు. దర్శకులు కూడా ఆమె కోసమే ప్రత్యేకంగా స్క్రిప్టులు రాయసాగారు. భాగమతి, నిశ్శబ్దం వంటి సినిమాలు ఇలా వచ్చినవే. ఇక బాహుబలిలో అనుష్క షెట్టి పాత్ర చిరస్మరణీయంగా మిగిలిపోతుందనడంలో సందేహం లేదు. ఇలా అగ్ర కథానాయికగా వెలిగిపోతున్నసమయంలో ఆమె సైజ్ జీరో(Size Zero) అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ఆమె కెరీర్‌కు బ్రేకులు వేసింది. ఆ సినిమాలో పాత్ర కోసం అనుష్క బరువు పెరిగింది. ఇంత పెద్ద సాహసం మరో హీరోయిన్ చేసి ఉండరు. ఆ తర్వాత ఆమె బరువు తగ్గడం కష్టంగా మారింది. చాలా బొద్దుగా తయారయ్యారు. అప్పుడు కూడా అనుష్క అందంగా కనిపించడం విశేషం. లేటెస్ట్‌గా అనుష్క మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి(Miss Shetty Mr Polishetty) సినిమాలో నటించింది. ఈ సినిమాపై అనుష్క చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆమె ఆశలు ఫలించాయి. కాస్త ఆలస్యం అయినా ఇటీవల విడుదలైన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలోనూ మంచి పేరు తెచ్చుకుంది. అనుష్కకు ఇది కమ్ బ్యాక్ సినిమా అయిందనుకోవాలి. ఈ సందర్భంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి చెప్పుకొచ్చారు. నటిగా తనకు ఇంత బ్రేక్ వస్తుందని ఎప్పుడూ అనుకోలేదన్నారు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వంటి కొత్త కాన్సెప్ట్‌తో కూడిన ఒరిజినల్ కథా చిత్రంలో నటించడం సంతోషంగా ఉందన్నారు. ఇకపై వరుసగా నటిస్తానని తెలిపారు. ఈ మధ్యన ఎక్కువగా ఆలయాలను సందర్శించడంపై వివరణ ఇచ్చుకున్నారు. తనకు చిన్నతనం నుంచి కుటుంబసభ్యులతో ఆలయాలకు వెళుతుండేదానినని, నటిగా బిజీగా మారిన తర్వాత ఆలయాలకు వెళ్లడానికి టైమ్ దొరకలేదని, అయితే ఇంట్లో ఇప్పటికీ సోమవారం, శుక్రవారం పూజలు చేస్తానని చెప్పారు. ఇటీవల ఖాళీగా ఉండడంతో ఆలయాలకు వెళ్లి భగవంతుడి దర్శనం చేసుకున్నారని పేర్కొన్నారు. పెళ్లి కోసమే ఆలయాలు సందర్శిస్తున్నారా? పూజలు చేస్తున్నారా? అన్న ప్రశ్నలకు ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని చెప్పారు. కాగా ప్రస్తుతం అనుష్క ఓ మలయాళం చిత్రంలో నటించబోతున్నారు.