ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన బేబీ(Baby) సినిమా సూపర్‌ డూపర్‌ హిట్టయ్యింది. ఓ పెద్ద సినిమాకు వచ్చినన్ని కలెక్షన్లు వస్తున్నాయి. మాములుగా తెలుగులో చిన్న సినిమాలు హిట్‌ అవ్వడమన్నది ఇప్పుడు చాలా అరుదుగా మారింది. ఒకవేళ ప్రేక్షకుల ఆదరణను సంపాదించుకున్నా అత్యధిక వసూళ్లను సాధించిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాంటిది బేబీ సినిమా ఈ రెండూ సాధించింది. చాలా కేంద్రాలలో అత్యధిక వసూళ్లను రాబట్టింది.

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన బేబీ(Baby) సినిమా సూపర్‌ డూపర్‌ హిట్టయ్యింది. ఓ పెద్ద సినిమాకు వచ్చినన్ని కలెక్షన్లు వస్తున్నాయి. మాములుగా తెలుగులో చిన్న సినిమాలు హిట్‌ అవ్వడమన్నది ఇప్పుడు చాలా అరుదుగా మారింది. ఒకవేళ ప్రేక్షకుల ఆదరణను సంపాదించుకున్నా అత్యధిక వసూళ్లను సాధించిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాంటిది బేబీ సినిమా ఈ రెండూ సాధించింది. చాలా కేంద్రాలలో అత్యధిక వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో వైష్ణవి చైతన్య(Vaishnavi Chaithanya) అనే అమ్మాయి కథానాయికగా నటించింది. బేబీలో ఈమె నటనను మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi), స్టయిలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌(Allu Arjun) తెగ పొగిడేశారు. బేబీ తర్వాత వైష్ణవి చైతన్యకు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడుఈమెను పెద్దగా పట్టించుకోవడం లేదనే అనుమానం కలుగుతోంది. డబ్ స్మాష్, టిక్ టాక్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి చైతన్య ఆ తర్వాత యూట్యూబర్‌గా మారింది.

కవర్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్‌లో నటిస్తూ నెమ్మదిగా క్రేజ్‌పెంచుకుంది. కొన్ని సినిమాలలో చిన్న చిన్న పాత్రలు వేసిన వైష్ణవి చైతన్య మంచి రోల్‌ కోసం ఎదురుచూస్తూ ఉంది. సరిగ్గా ఈ సమయంలోనే దర్శకుడు సాయి రాజేశ్‌(Sai Rajesh) దృష్టి వైష్ణవి చైతన్యపై పడింది. తను తీయబోతున్న సినిమాలో ఈమె అయితేనే బాగుంటుందని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఆమెను బేబీలో హీరోయిన్‌గా ఎంపిక చేశాడు. బోల్డ్ స్టోరీకి తోడు ఈమె నటనకు మంచి పేరు వచ్చింది. దీంతో బోలెడన్ని కొత్త ఆఫర్లు వస్తాయని భావించింది. కానీ జరుగుతున్నది వేరు అనిపిస్తుంది. బేబీ సినిమా నిర్మాత ఎస్‌కేఎన్‌ తీయబోయే రెండు కొత్త సినిమాల్లో వైష్ణవి హీరోయిన్ అనే టాక్ వినిపించింది. కానీ వీటికి ఇంకా చాలా సమయం ఉందని అంటున్నారు. అలానే రామ్, అల్లు శిరీష్ సినిమాల్లోనూ వైష్ణవిని హీరోయిన్‌గా తీసుకున్నారని అంటున్నారు కానీ ఇప్పటి వరకు దీనిపై క్లారిటీ రాలేదు. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థల నుంచి తనకు పిలుపు రాకపోవడానికి కారణం బేబీలో తన క్యారెక్టర్ బోల్డ్ కావడమే కావచ్చని వైష్ణవి చైతన్య అనుకుంటోంది. మరి వైష్ణవి నుంచి కొత్త సినిమా కబురు ఎప్పుడొస్తుందో ఏమో ...!

Updated On 15 Aug 2023 1:07 AM GMT
Ehatv

Ehatv

Next Story