మాస్ మహారాజా రవితేజ నటించిన ‘రావణాసుర’ టీజర్ రిలీజయింది. యాక్షన్ ఎంటర్టయినర్ గా తెరకెక్కుతున్న ‘రావణాసుర’లో రవితేజ నటిస్తున్న సంగతి తెలిసిందే. సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2023 ఏప్రిల్ 7న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ మూవీ విడుదలకు ముందు టీజర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ టీజర్లో ఇంటెన్స్, ఇంట్రెస్టింగ్ అండ్ సీక్రెట్ వంటి అంశాలు ఆడియన్స్ ను థ్రిల్ చేసే విధంగా కనిపిస్తున్నాయి. టీజర్లో మాస్ […]

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘రావణాసుర’ టీజర్ రిలీజయింది. యాక్షన్ ఎంటర్టయినర్ గా తెరకెక్కుతున్న ‘రావణాసుర’లో రవితేజ నటిస్తున్న సంగతి తెలిసిందే. సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2023 ఏప్రిల్ 7న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ మూవీ విడుదలకు ముందు టీజర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

ఈ టీజర్లో ఇంటెన్స్, ఇంట్రెస్టింగ్ అండ్ సీక్రెట్ వంటి అంశాలు ఆడియన్స్ ను థ్రిల్ చేసే విధంగా కనిపిస్తున్నాయి. టీజర్లో మాస్ రాజాను బ్రూటల్ మర్డర్స్ లో ఇన్వోల్వ్ అయినట్టు.. స్టైలిష్, పవర్ ఫుల్ క్రిమినల్ గా చూపించారు. ఇందులో సుశాంత్ కూడా ఇంటెన్స్ లుక్ లో కపిస్తున్నాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ సీన్స్ ను ఎలివేట్ చేయడంతోపాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ స్క్రీన్ ప్లై ఎక్స్ పెక్టేషన్స్ పెంచాయి. ‘‘సీతను తీస్కెళ్లాలంటే సముద్రం దాటితే సరిపోదు.. ఈ రావణాసురుడిని దాటి వెళ్లాలి’’ అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ ఇంపాక్ట్ చూపించింది.

ఈ మూవీలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాశ్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా నటిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు.

Updated On 6 March 2023 2:56 AM GMT
Ehatv

Ehatv

Next Story