ర‌వితేజ ఈగ‌ల్ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేసింది. ఈ సినిమా రెండు ఓటీటీల‌లో రిలీజైంది

ర‌వితేజ ఈగ‌ల్ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేసింది. ఈ సినిమా రెండు ఓటీటీల‌లో రిలీజైంది. మార్చి 1 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఈటీవీ విన్ ద్వారా ఓటీటీలో సందడి చేయనుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఐదు భాష‌ల్లో ఈ సినిమా రిలీజైంది. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈటీవీ విన్ ఓటీటీలో తెలుగులో మాత్ర‌మే చూడొచ్చు.

ఫిబ్ర‌వ‌రి 9న ఈ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. ఇర‌వై రోజుల్లోనే ఈగ‌ల్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. సినిమాటోగ్రాఫ‌ర్ కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. స్టైలిష్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, కావ్య‌థాప‌ర్ హీరోయిన్లుగా న‌టించారు. భారీ అంచ‌నాల న‌డుమ థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ పర్వాలేదని పించింది. ఓవరాల్‌గా ఫుల్ థియేట్రిక‌ల్ ర‌న్‌లో 24 కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్‌ను రాబట్టింది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని అనుకున్నారు. అయితే థియేటర్ల సమస్య కారణంగా సినిమాను వాయిదా వేసుకుని ఫిబ్రవరి నెలలో విడుదల చేశారు. ఇప్పుడు ఓటీటీలో మరింత మందికి సినిమా చేరువకాబోతోంది.

Updated On 29 Feb 2024 11:28 PM GMT
Yagnik

Yagnik

Next Story