రోజూ ఏం తింటున్నాడో ఏమో అంత లావున్నాడు ... అని కాసింత బొద్దుగా ఉన్నవారిపై కామెంట్లు విసురుతుంటారు కొందరు. నిజానికి తిండికి లావుకు ఎలాంటి సంబంధమూ లేదు. సన్నగా ఉన్నవారు కొందరు సుష్టుగా భోం చేస్తారు..

రోజూ ఏం తింటున్నాడో ఏమో అంత లావున్నాడు ... అని కాసింత బొద్దుగా ఉన్నవారిపై కామెంట్లు విసురుతుంటారు కొందరు. నిజానికి తిండికి లావుకు ఎలాంటి సంబంధమూ లేదు. సన్నగా ఉన్నవారు కొందరు సుష్టుగా భోం చేస్తారు.. లావుగా ఉన్నవారిలో కొందరు రెండు ముద్దలు తినేసి చేతులు కడుక్కుంటారు. అంటే కిలోల కొద్దీ తిన్నా కొందరు సన్నగా ఉంటారు.

ఏమీ తినకపోయినా లావుగా కనిపిస్తారు. లావైపోతే మళ్లీ సన్నబడటం కష్టం. కొందరికే అది సాధ్యం. మితాహారం తీసుకున్నా, గంటల కొద్దీ వ్యాయామాలు చేసినా కొందరు బరువు తగ్గరు. తమిళ సినీ నిర్మాత రవీందర్‌ చంద్రశేఖర్‌ది(Ravindher Chandra shekaran) కూడా పాపం ఇదే సమస్య. చాన్నాళ్ల నుంచి ఆయన అధిక బరువుతో బాధపడుతున్నాడు. బుల్లితెర నటి మహాలక్ష్మిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆయనపై జనం విమర్శలు చేయడం మొదలు పెట్టారు.

మహాలక్ష్మి సన్నగా ఉంటారు. ఈయనదేమో భారీ శరీరం. జనం ఆడిపోసుకోవడానికి ఇది చాలదూ! డబ్బుల కోసమే మహాలక్ష్మి ఈయనను పెళ్లి చేసుకున్నారంటూ దెప్పిపొడవసాగారు. వీళ్ల వైవాహిక జీవితం ఎంతోకాలం ఉండదంటూ శాడిజాన్ని ప్రదర్శించారు. సోషల్‌ మీడియాలో ఇలాంటి వార్తలు వచ్చినప్పుడల్లా తమది అన్యోన్య దాంపత్యమని చాటుకోవడానికి ఫోటోలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఈ దంపతులకు.

లేటెస్ట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన అధిక బరువుకు కారణాలను వివరించారు రవీందర్‌. తానెప్పుడూ తన బరువుపై దృష్టి పెట్టనని, అందుకు బదులుగా ఆరోగ్యంపైనే ఎక్కువ దృష్టి పెడతానని అన్నారు. ఫలానాది తినాలి, ఫలానాది తినకూడదు వంటి నియమ నిబంధనలను పెట్టుకోనని చెప్పారు. తాను డైట్‌ పాటించి చూశానని, అది వర్కవుట్‌ అవ్వలేదని అన్నారు. గతంలో రవీందర్‌ ఓ చికిత్స తీసుకున్నప్పుడు శరీరంలో కొవ్వు కరిగించే కణాలు తగ్గిపోయాయట. అదే బరువు పెరగడానికి కారణమయ్యిందట.

Updated On 10 Jun 2023 6:19 AM GMT
Ehatv

Ehatv

Next Story