మాస్ మహారాజా రవితేజ(Hero raviteja) తాజా సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమయ్యింది. ఇది రవితేజ కెరీర్‌లో 75వ సినిమా కావడం విశేషం. విజయవంతమైన నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sithara entertainment), ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. యువ రచయిత భాను బోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

Hero Raviteja 75 Movie
మాస్ మహారాజా రవితేజ(Hero raviteja) తాజా సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమయ్యింది. ఇది రవితేజ కెరీర్‌లో 75వ సినిమా కావడం విశేషం. విజయవంతమైన నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sithara entertainment), ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. యువ రచయిత భాను బోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మాస్ మహారాజా రవితేజ పేరు వినగానే గుర్తొచ్చేది మాస్, కామెడీ. తనదైన మాస్ యాటిట్యూడ్, కామెడీ టైమింగ్ తోనే ఆయన ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఈ కొత్త సినిమాలోనూ హాస్యంతో కూడిన మాస్ పాత్రలో కనిపించనున్నారని చిత్రబృందం తెలిపింది. వినోదంతో కూడిన పూర్తిస్థాయి మాస్ పాత్రలో రవితేజను చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంతో అభిమానుల కోరిక నెరవేరుతుందని చిత్ర బృందం హామీ ఇచ్చింది. బ్లాక్ బస్టర్ చిత్రం 'వాల్తేరు వీరయ్య'కి మాటల రచయితగా, మరో బ్లాక్ బస్టర్ 'సామజవరగమన'కు కథ, స్క్రీన్‌ప్లే రచయితగా పని చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు భాను బోగవరపు. నందమూరి బాలకృష్ణ కథనాయకుడిగా తెరకెక్కుతోన్న 'NBK109'కి మాటలు రాస్తున్నారు. ఇలా రచయితగా అనతి కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్న భాను బోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్నారు. హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తోంది. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. విధు అయ్యన్న ఛాయాగ్రాహకుడిగా వ్యవరిస్తున్న ఈ చిత్రానికి, శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
