✕
Raviteja Ravanasura: రావణాసుర.. మాస్ మహరాజ మార్క్.. టాక్ వింటేనే..!
By EhatvPublished on 25 March 2023 1:05 AM GMT
మాస్ మహరాజ హీరో, సుధీర్ వర్మ డైరెక్టర్ (Sudheer Varma Director) ఇవన్నీ ఒక్కసారి పక్కన పెడితే.. ఈ సినిమాకు ప్రత్యేకమైన గ్లామర్ వచ్చిన పాయింట్... వెరీవెరీ ఇంట్రస్టింగ్ ఎలిమెంట్.. నిర్మాణ సారధ్యాన్ని రవితేజ (Ravi Teja)యే స్వయంగా నిర్వహించడం. అంటే తనకి అంతగా కథ నచ్చి, నిర్మాతగా కూడా వ్యవహరించడానికి పూనుకున్నాడంటే ‘రావణాసుర’ (Ravanasura) చిత్రానికి అక్కడే ఫుల్ మార్క్స్ పడ్డాయి.

x
Ravanasura Raviteja
-
- మాస్ మహరాజ హీరో, సుధీర్ వర్మ డైరెక్టర్ (Sudheer Varma Director) ఇవన్నీ ఒక్కసారి పక్కన పెడితే.. ఈ సినిమాకు ప్రత్యేకమైన గ్లామర్ వచ్చిన పాయింట్... వెరీవెరీ ఇంట్రస్టింగ్ ఎలిమెంట్.. నిర్మాణ సారధ్యాన్ని రవితేజ (Ravi Teja)యే స్వయంగా నిర్వహించడం. అంటే తనకి అంతగా కథ నచ్చి, నిర్మాతగా కూడా వ్యవహరించడానికి పూనుకున్నాడంటే ‘రావణాసుర’ (Ravanasura) చిత్రానికి అక్కడే ఫుల్ మార్క్స్ పడ్డాయి.
-
- ఎంతగా కథ నచ్చితే, ఎంతగా సుధీర్ వర్మ (Sudheer Varma) రవితేజ (Ravi Teja)ని ఇంప్రెస్ చేయగలిగితే... రవితేజ (Ravi Teja) నిర్మాణంలో పాలు పంచుకోవాలని కోరుకుంటాడు....? ‘స్వామి రారా’ చిత్ర దర్శకుడిగా సుధీర్ వర్మ (Sudheer Varma) కి సినీట్రేడ్లోనూ, ప్రేక్షకులలోనూ కూడా ఓ స్పెషల్ ఐడెంటిటీ ఉండడటం ఇందులో మరో ప్లస్ పాయింట్.
-
- ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పుడే ‘రావణాసుర’ (Ravanasura) చిత్రానికి టాప్ గేర్ పడింది. రవితేజ (Ravi Teja) లాంటి సూపర్ మాస్ ఇమేజ్ ఉన్న హీరో ఎక్స్ట్రా ఎనర్జీ.. డబుల్ పవర్‌తో కనిపిస్తుంటే సినిమా మీద గ్యారెంటీగా అంచనాలు పెరిగిపోతాయి. పైగా, రవితేజ ట్రెండ్ ఇప్పుడు మామ్మూలుగా లేదు.
-
- నక్కిన త్రినాధరావు ( Trinadha Rao Nakkina) దర్శకత్వంలో రవితేజ చేసిన ‘ధమాకా’ 100 కోట్ల పైచిలుకు వసూలు చేసి ఓ సంచలన సృష్టించింది. వెంటనే విడుదలైన ‘వాల్తేర్ వీరయ్య’ బాక్సాఫీసులో భూకంపం తెచ్చింది. వీరయ్య మెగాస్టార్ చిరంజీవి సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాక రికార్డులు బద్దలు కొట్టి, రవితేజ గ్రాఫ్‌ని మరింత పెంచింది.
-
- ఇప్పుడు ఈ క్రమంలో ‘రావణాసుర’ (Ravanasura) విడుదలకు అన్నీ హంగులు పూర్తి చేసుకునే దశలో పరిగెడుతోంది. రవితేజ అంటేనే ఎంటర్ టైన్మెంట్, యాక్షన్, పాటలు, డాన్స్‌లు.... అవన్నీ ఉన్న ఓ మాస్ యాక్షన్ ఫిల్మ్‌గా రావణాసుర మీద పెద్ద రేంజ్‌లోనే బెట్టింగ్‌లు జరుగుతున్నాయి.
-
- రవితేజకున్న మరో రికార్డును ఇక్కడ ప్రస్తావించాలి. కరోనాతో ప్రపంచం మొత్తం కకావికలమైపోయి, సినిమా పరిశ్రమ కుదేలై, కుప్పకూలిపోయిన టైంలో ఎవరు పరిశ్రమని ఆదుకుంటారు అని అందరూ దిక్కులు చూస్తుంటే... అదిగో అప్పుడే క్రాక్ (Krack) రిలీజై సినిమా ఇండస్ట్రీకి మళ్ళీ లైఫ్ ఇచ్చింది.
-
- అది రవితేజ (Ravi Teja) వల్లే సాధ్యమైంది. రవితేజకి మాస్లో ఉన్న గ్రిప్ అది. మాస్‌ని ధియేటర్లవైపుకి పరుగులు తీయించాడు. ప్రస్తుతం ధియేటర్లన్నీ ఫుల్ స్వింగ్‌లో నడుస్తున్నాయి. ఆ స్వింగ్‌కి రవితేజ్ స్వింగ్ మరింత యాడ్ అవుతోంది. ‘రావణాసుర’ చిత్రానికి ఉన్న టాక్ వింటుంటే... ‘బలాదూర్’ ఇది మరో హిట్ అన్న హోప్స్ ఆటోగేర్ స్టయిల్లో దూసుకెళ్ళాయి.
-
- మాస్ హీరోలకున్న ఎడ్వాంటేజ్ అదే. ఒక్కసారి ఫాంలోకి వచ్చారంటే...ఇంక ..వాళ్ళని వాళ్ళే కంట్రోల్ చేసుకోలేరు. అలా ఉంటుందా మాస్ ప్రభంజనం. రవితేజ (Ravi Teja) యాజ్ టీజ్ అదే సూపర్ ఫాంలో ఉన్న మాస్ హీరో. అందుకే ‘రావణాసుర’ రచ్చరచ్చ చేస్తుందనే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బెస్ట్ ఆఫ్ లక్....మాస్ మహరాజ....

Ehatv
Next Story