రవితేజ హీరోగా వస్తున్న సినిమా టైగర్‌ నాగేశ్వరరావు. ఈ సినిమా టీజర్‌ ఇటీవలే విడుదలయ్యింది. ఇందులో వాడిన భాష ఓ వర్గాన్ని కించపరిచేలా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. సెన్సార్‌ బోర్డు అనుమతి లేకుండా టీజర్‌ను రిలీజ్‌ చేయడంపై న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది.

రవితేజ హీరోగా వస్తున్న సినిమా టైగర్‌ నాగేశ్వరరావు. ఈ సినిమా టీజర్‌ ఇటీవలే విడుదలయ్యింది. ఇందులో వాడిన భాష ఓ వర్గాన్ని కించపరిచేలా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. సెన్సార్‌ బోర్డు అనుమతి లేకుండా టీజర్‌ను రిలీజ్‌ చేయడంపై న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది. తగిన అనుమతులు తీసుకోకుండా టీజర్‌ను ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించింది. ఇలాంటి టీజర్ల ద్వారా సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారని సూటిగా అడిగింది. సమాజం పట్ల బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉందని హైకోర్టు చెప్పింది. ధనార్జనే ధ్యేయంగా సినిమాల నిర్మాణం ఉండకూడదని పేర్కొంది. ఈ మేరకు టైగర్‌ నాగేశ్వరరావు చిత్ర నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌కు నోటీసులు జారీ చేసింది. అలాగే సెన్సార్‌ బోర్డు చైర్‌ పర్సన్‌ను ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్‌గా స్పష్టం చేసింది. సినిమాపై అభ్యంతరాలన్నింటినీ సీబీఎఫ్‌సీ చైర్‌ పర్సన్‌కు చెప్పుకునేందుకు పిటిషనర్‌కు అనుమతి ఇచ్చింది. తర్వాతి విచారణను సెప్టెంబర్‌ 27వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌, న్యాయమూర్తి జస్టిల్‌ ఆకుల వెంకట శేషసాయి ధర్మాసన బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. టైగర్‌ నాగేశ్వరరావు సినిమా ఎరుకల సామాజిక వర్గం మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ చుక్కా పాల్‌రాజ్‌ అనే వ్యక్తి హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు.

Updated On 31 Aug 2023 11:40 PM GMT
Ehatv

Ehatv

Next Story