వరుస సినిమాలతో మంచి ఊపు మీద ఉన్నాడు మాస్ మహారాజ్ రవితేజ(Mass Raviteja). గెలుపోటములు లెక్క చేయకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇక తాజాగా వెంట వెంటనే ప్లాప్ లు చూసిన రవితేజకు.. టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageshwar Rao) సినిమా సక్కెస్ చాలా ఇంపార్టెంట్ గా మారింది. ఇక ఈమూవీ రిలీజ్ పై తాజాగా అప్ డేట్ వచ్చేసింది.

Tiger Nageshwar Rao Release Date
వరుస సినిమాలతో మంచి ఊపు మీద ఉన్నాడు మాస్ మహారాజ్ రవితేజ(Mass Raviteja). గెలుపోటములు లెక్క చేయకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇక తాజాగా వెంట వెంటనే ప్లాప్ లు చూసిన రవితేజకు.. టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageshwar Rao) సినిమా సక్కెస్ చాలా ఇంపార్టెంట్ గా మారింది. ఇక ఈమూవీ రిలీజ్ పై తాజాగా అప్ డేట్ వచ్చేసింది.
మాస్ మహారాజా రవితేజ హీరోగా నుపుర్ సనన్(Nupur Sanon), గాయత్రి భరద్వాజ్(Gayathri Bharadwaj) హీరోయిన్స్ గా యువ దర్శకుడు వంశీ(Director Vamshi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియన్ మూవీ టైగర్ నాగేశ్వరరావు. ఈ మూవీ పై మొదటి నుండి రవితేజ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈమూవీపై తాజాగా చాలా కాంట్రవర్సీలు మొదలయ్యాయి. స్టువర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా ఈమూవీ రాబోతోంది.
అయితే ఈసినిమా విషయంలో తమను సంప్రదించలేదని.. తమ గ్రామాన్ని దొంగల ఊరుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుందని. టైగర్ నాగేశ్వరరావు ను గజదొంగగా చూపించడం కరెక్ట్ కాదంటూ.. నిరసనలు చేస్తున్నారు ఊరి జనాలు. ఈక్రమంలో ఈవిషయంలో కోర్ట్ లో కేస్ కూడా దాఖలు అయ్యింది. ఇక ఈమూవీకి సబంధించి తాజాగా ఓ అప్ డేట్ వచ్చింది.
ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ అందరినీ ఆకట్టుకోగా రానున్న అక్టోబర్ 3న ట్రైలర్ ని రిలీజ్(Trailer release) చేయనున్నట్లు మేకర్స్ ఒక పోస్టర్ ద్వారా అఫీషియల్ గా ప్రకటించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న ఈమూవీని గజదొంగ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తెరకెక్కిస్తుండగా దీనిని అక్టోబర్ 20న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు మేకర్స్.
#TigerNageswarRao 🥷@RaviTeja_offl @DirVamsee pic.twitter.com/RDq2KlZVbt
— Abhishek Agarwal 🇮🇳 (@AbhishekOfficl) September 26, 2023