పాపం రవితేజ(raviteja) మళ్లీ వ్యవహారం మొదటికి వచ్చింది. లైన్ లో పడ్డాడు అనుకుంటే.. మళ్లీ దెబ్బపడింది. ఇలా రిలీజ్ అయ్యిందో లేదో.. అలా ఓటీటీలోకి వచ్చేస్తోంది మాస్ మహారాజ్ రవితేజ రావణాసుర(Ravanasura) సినిమా.

పాపం రవితేజ(raviteja) మళ్లీ వ్యవహారం మొదటికి వచ్చింది. లైన్ లో పడ్డాడు అనుకుంటే.. మళ్లీ దెబ్బపడింది. ఇలా రిలీజ్ అయ్యిందో లేదో.. అలా ఓటీటీలోకి వచ్చేస్తోంది మాస్ మహారాజ్ రవితేజ రావణాసుర(Ravanasura) సినిమా.

మరోసారి దెబ్బ గట్టిగా పడింది. వరుసగా ప్లాప్ లు చూస్తూ.. ఇక రవితేజ పని అయిపోయింది అనుకున్నటైమ్ లో.. క్రాక్(Crack) సినిమాతో ఫామ్ లోకి వచ్చాడు రవితేజ. మంచి జోష్ మీద ఉన్న మాస్ మహారాజ్ రవితేజ జోరుకు బ్రేక్ లు వేసింది రావణాసుర సినిమా. చాలా కాలం తరువాత మంచి మంచి సినిమాలు చేసుకుంటూ.. హిట్లు కొడుతున్నాడు అనుకుంటే.. అనుకోకుండా.. మళ్లీ దెబ్బ పడింది రవితేజకు. రావణాసుర సినిమాతో మళ్లీ భారీ ప్లాప్ పడింది.

ఇక ఈమూవీ ఇక ఓటీటీ(OTT) రిలీజ్ కు రెడీ అయిపోయింది. ఈ మూవీ హక్కులు అమెజాన్ ప్రైమ్(Amazon Prime) వారు 12 కోట్లకు కొనుగోలుచేసినట్టు తెలుస్తోంది. ఈ నెల లాస్ట్ వీక్ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలుస్తుంది. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంటుంది. ఇంత త్వరగా ఈసినిమా ఇలా ఓటీటీలోకి వచ్చేయడం.. అందరకి షాక్ ఇస్తోంది.

రవితేజకు రావాణాసుర భారీ షాక్ ను ఇచ్చింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈసినిమా.. మొదటి ఆట నుంచే నెగెటీవ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే దాదాదాపు ఈ సినిమా చాలా వరకు థియేటర్‌లలో నుంచి వెళ్లిపోయింది. రవితేజ్ నటనకు మాత్రం మంచి పేరు అయితే ఫలితం ఎలా ఉన్నా రవితేజ నటన మాత్రం ఈ సినిమాలో అద్భుతమంటున్నారు ఫ్యానస్. హీరోనే అయినా.. నెగెటీవ్‌ క్యారెక్టర్‌లో కూడా మాస్ మహారాజ్ చించేశాడు. ఇక సుధీర్‌ వర్మ అద్భుతమైన కథను రాసుకున్నా.. సినిమాను తెరకెక్కించే పరంగా మాత్రం విఫలమయ్యాడు.

ఇక యాక్షన్ థ్రిల్లర్‌ బ్యాక్ గ్రౌండ్ కథతో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ జోడీగా ఐదుగురు హీరోయిన్లు నటించారు. అను ఇమాన్యూయేల్‌, మేఘా ఆకాశ్‌, ఫ‌రియా అబ్దుల్లా, దక్షా నగర్కర్, పూజిత పొన్నాడ మాస్ మహారాజ పక్కన సందడి చేశారు. ఇక అక్కినేని సుశాంత్‌ కీలకపాత్ర పోషించగా... ఈ సినిమాను అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌తో క‌లిసి ర‌వితేజ ఆర్‌టీ టీం వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కించాడు.

Updated On 17 April 2023 1:13 AM GMT
Ehatv

Ehatv

Next Story