గెలుపు ఓటములతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు మాస్ మహారాజా రవితేజ(Ravi Teja). యంగ్ స్టార్స్ కు పోటీ ఇస్తూ.. ఫిట్ నెస్ విషయంలో సత్తా చాటుతున్నాడు. ఇక తాజాగా రవితేజ తన కొత్త చిత్రం 'మిస్టర్ బచ్చన్'(Mister Bachchan) లాంఛనంగా ప్రారంభించారు. దాదాపు 12 ఏళ్ల తరువాత దర్శకుడు హరీశ్ శంకర్(Harish Shankar) డైరెక్షన్ లో నటిస్తున్నాడు మాస్ మహారాజ్.

ravi teja
గెలుపు ఓటములతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు మాస్ మహారాజా రవితేజ(Ravi Teja). యంగ్ స్టార్స్ కు పోటీ ఇస్తూ.. ఫిట్ నెస్ విషయంలో సత్తా చాటుతున్నాడు. ఇక తాజాగా రవితేజ తన కొత్త చిత్రం 'మిస్టర్ బచ్చన్'(Mister Bachchan) లాంఛనంగా ప్రారంభించారు. దాదాపు 12 ఏళ్ల తరువాత దర్శకుడు హరీశ్ శంకర్(Harish Shankar) డైరెక్షన్ లో నటిస్తున్నాడు మాస్ మహారాజ్. ఈ సీనియర్ హీరోనకు మిరపకాయ సినిమాతో మంచి హిట్ ఇచ్చిన హరీష్ శంకర్.. రవితేజ జోడి మరోసారి సందడి చేయబోతోంది.
ఇక ఈమూవీని రవితేజ సరసన కొత్త హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri borse) నటిస్తోంది. ఈసినిమా ద్వారా ఆమె టాలీవుడ్(Tollywood) ఎంట్రీ ఇవ్వబోతోంది. ఉత్తరాదికి చెందిన ఈ అందాల భామకు ఇదే తొలి చిత్రం అని తెలుస్తోంది. మిస్టర్ బచ్చన్' చిత్రం ఈ నెలలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. నిర్మాత టీజీ విశ్వప్రసాద్(TG Vishwa Prasad) తమ పీపుల్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మికీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.
కాగా, ఈ చిత్రం ప్రారంభోత్సవంపై రవితేజ స్పందిస్తూ... తన అభిమాన బాలీవుడ్ హీరో. అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) పేరుతో ఉన్న పాత్రను పోషిస్తున్నానని, ఇదొక గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు.మిస్టర్ బచ్చన్' ముహూర్తం షాట్ కు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు(Raghuramakrishnam Raju) కూడా హాజరయ్యారు. రఘురామకు హీరో రవితేజ కజిన్ అవుతారు.
