రవితేజ(Raviteja) హీరోగా వంశీ(Vamsi) దర్శకత్వంలో రూపొందిన 'టైగర్ నాగేశ్వరరావు'(Tiger Nageswara Rao) అభిషేక్ అగర్వాల్(Abhishek Aggarwal) నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 20వ తేదీన విడుదలైంది. సూపర్ హిట్ కాదు కాని.. యావరేజ్ టాక్ తెచ్చుకుంది మూవీ. నుపుర్ సనన్(Nupur Sanon) తో పాటు గాయత్రి భరద్వాజ్(Gayatri Bharadwaj) హీరోయిన్లు గా నటించిన ఈసినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించారు. థియేటర్ల నుంచి ఆశించినస్థాయిలోఫలితాన్నిసాధించలేదు సినిమా.. ఇక ఓటీటీ రిలీజ్ ఎప్పుడా అని అంతా ఎదరు చూడసాగారు.

Tiger Nageswara Rao

ఈక్రమంలో టైగర్ నాగేశ్వరరావు సినిమా సడెన్ గా ఓటీటీలో(OTT) ప్రత్యక్ష్యం అయ్యింది. ఎటువంటి ప్రచారం లేకుండానే ఈసినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ రోజు(నవంబర్ 17) నుంచి అమెజాన్ ప్రైమ్ లో టైగర్ నాగేశ్వరరావు సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ముందుగా ఎలాంటి పోస్టర్ రిలీజ్ లేకుండానే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అడుగుపెట్టడం అందరిని ఆశ్చర్య పరిచింది. అయితే సినిమా స్ట్రీమింగ్ అవ్వడంతో.. ఎక్కువ మంది ప్రేక్షకులు ఈసినిమాను చూడటానిక ఉత్సాహం చూపిస్తున్నారు.
ఇక రియల్ స్టోరీ ఆధారంగా సినిమా తెరెక్కింది. 1970ల కాలంలో దేశాన్ని గడగడలాడించిన స్టువర్టుపురం గజదొంగగా హడలెత్తించిన 'టైగర్ నాగేశ్వరరావు' బయోపిక్ గా ఈ సినిమా రూపొందింది. ఈమూవీపై ముందుగా పలు వివాదాలుతలెత్తగా.. వాటన్నింటిని క్లియర్ చేసుకుంటూ.. మూవీని రిలీజ్ చేశారు టీమ్. ఇక ఈమూవీద్వారా పవర స్టార పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ రీ ఎంట్రీ ఇచ్చారు. హేమలతా లవణం పాత్రలో ఆమె కనిపించారు. ఇక అనుపమ్ ఖేర్ .. మురళీ శర్మ .. జిషు సేన్ గుప్తా .. హరీశ్ పేరడీ .. ఆడుకాలం నరేన్ .. రేణు దేశాయ్ ముఖ్యమైన పాత్రలలో నటించారు. రవితేజ బాడీ లాంగ్వేజ్ కి కాస్త దూరంగా కనిపించే ఈ సినిమా, ఓటీటీ వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుందనేది చూడాలి.