మాస్ మహారాజా రవితేజ(ravi teja) వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తీరిక లేకుండా ఉన్నారు. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న చిత్రాలలో ఈగల్(eagle) ఒకటి. సినిమాటోగ్రాఫర్‌గా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి దర్శకుడిగా మారిన కార్తీక్ ఘట్టమనేని(karthik ghattamaneni) ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా గురించి లేటెస్ట్ అప్‌డేట్ బయటకు వచ్చింది.

Eagle Movie shooting location
మాస్ మహారాజా రవితేజ(ravi teja) వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తీరిక లేకుండా ఉన్నారు. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న చిత్రాలలో ఈగల్(eagle) ఒకటి. సినిమాటోగ్రాఫర్‌గా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి దర్శకుడిగా మారిన కార్తీక్ ఘట్టమనేని(karthik ghattamaneni) ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా గురించి లేటెస్ట్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లోని(hyderabad) అల్యూమినియం ఫ్యాక్టరీలో(aluminium Factory) కొనసాగుతోంది. జులై నాలుగు వరకు ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. తాజా షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని అంటున్నారు.
ఈ చిత్రంలో మలయాళ నటి అనుపమ పరమేశ్వరన్(anupama Parameswaran) హీరోయిన్ పాత్రను పోషిస్తున్నారు. మరో కీలక పాత్రలో కావ్య థాపర్(Kavya Thapar) నటిస్తున్నారు. నవదీప్(navdeep), శ్రీనివాస్ అవసరాల(srinivas avasarala), మధుబాల ఇతర నటీనటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరోవైపు పాన్ ఇండియా ప్రాజెక్టు టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) సినిమాతో రవితేజ ఫుల్ బిజీగా ఉన్నాడు. 1970లలో సూవర్ట్‌పురంలో పాపులర్ దొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్ నటి కృతి సనన్ చెల్లెలు నుపుర్ సనన్ టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావులో సెకండ్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో గాయత్రి భరద్వాజ్ నటిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ దర్శకనిర్మాత, నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సంగీతాన్ని జీవీ ప్రకాశ్ కుమార్ అందిస్తున్నాడు.
