చాలా మంది అమ్మాయిలే క్యాస్టింగ్ కౌచ్(casting couch)ఎదుర్కొంటారు అని అనుకుంటారు. కానీ గత కొంత కాలంగా మగాళ్లు కూడా తామూ క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొంటున్నారు.. రీసెంట్ గా ఓ స్టార్ తాను ఎదుర్కోన్న అనుభవాన్ని వివరించాడు.
ఫిల్మ్ ఇండస్ట్రీలో గత కొన్నాళ్ళుగా నానుతున్న విషయం క్యాస్టింగ్ కౌచ్. అమ్మాయిలు ఇండస్ట్రీలోకి రావాలన్నా.. మంచి సినిమాలో ఛాన్స్ దక్కించుకోవాలి అన్నా.. ఏదో ఒకటి సమర్పించుకోవాల్సిందే..
చాలా మంది అమ్మాయిలే క్యాస్టింగ్ కౌచ్(casting couch)ఎదుర్కొంటారు అని అనుకుంటారు. కానీ గత కొంత కాలంగా మగాళ్లు కూడా తామూ క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొంటున్నారు.. రీసెంట్ గా ఓ స్టార్ తాను ఎదుర్కోన్న అనుభవాన్ని వివరించాడు.
ఫిల్మ్ ఇండస్ట్రీలో గత కొన్నాళ్ళుగా నానుతున్న విషయం క్యాస్టింగ్ కౌచ్. అమ్మాయిలు ఇండస్ట్రీలోకి రావాలన్నా.. మంచి సినిమాలో ఛాన్స్ దక్కించుకోవాలి అన్నా.. ఏదో ఒకటి సమర్పించుకోవాల్సిందే.. దాదాపు ఇండస్ట్రీలో ఈరకమైనవి ఎప్పటి నుంచో ఉన్నా.. చాలా మంది బయటపడలేక.. కామ్ గా ఉంటారు. కాని కొంత మంది మాత్రం బయటపడి రచ్చ రచ్చ చేస్తుంటారు. ముఖ్యంగా అమ్మాయిల్లోనే క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఉంటుందని అనుకుంటారంతా.. కాని చిత్రంగా ఈమధ్య మగవారిలో కూడా చాలామంది నటులు ఈ ఆరోపణలతో బయటకు వస్తున్నారు.
చాలా మంది అమ్మాయిలే క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొంటారు అని అనుకుంటారు. కానీ గత కొంత కాలంగా మగాళ్లు కూడా తామూ క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నాము అంటూ బహిరంగంగానే చెబుతున్నారు. తాజాగా మరో స్టార్ నటుడు తాను కూడా కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఫేస్ చేశానంటూ చెప్పుకొచ్చాడు ఆయన ఎవరో కాదు రేసుగుర్రం సినిమాలో బన్నీ విలన్ గా నటించిన బాలీవుడ్ స్టార్.. బోజ్ పూరీ హీరో రవికిషన్. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఓ మహిళ తనను వాడుకోవాలని చూసినట్లు రేసుగుర్రం విలన్ రవి కిషన్ చెప్పుకొచ్చాడు.
రవి కిషన్(Ravi Kishan).. రేసుగుర్రం సినిమాలో స్టైలిష్ విలన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఒక్క సినిమాతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న ఈస్టార్.. బీజేపీ తరపునుంచి ఎంపీగా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ సంఘటన గురించి చెప్పుకొచ్చాడు.
ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రవికిషన్ ఈ విధంగా చెప్పుకొచ్చాడు. క్యాస్టింగ్ కౌచ్ అనేది సినిమా పరిశ్రమలో ఉంది. నేను దానిని ఎదుర్కొన్నాను. అయితే దాని నుంచి నేను తప్పించుకున్నాను. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఓ మహిళ నన్ను రాత్రికి కాఫీ తాగడానికి రమ్మన్నది. ఆమె మాటలు నాకు అర్ధం అయ్యాయి కాబట్టి వెంనటే నేను నో చెప్పాను. ప్రస్తుతం ఆ మహిళ పెద్ద స్థాయిలో ఉంది.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
అయితే చిన్నప్పటి నుంచి మా నాన్న ఒక మాట చెప్పేవారు. ఏ రంగంలో అయినా అవకాశాల కోసం అడ్డదారులు తొక్కకూడదు, నిజాయితీగా ఉండాలని అనేవారు. అందులోనూ.. నేను సినిమాల్లోకి రావడం నాన్నకు ఇష్టం లేదు.. కాని అమ్మ మాత్రం నాకు ఫుల్ సపోర్ట్ గా ఉండేది అతని చెప్పుకోచ్చారు రవికిషన్. ఈ సందర్భంగా అప్పటి రోజులను గుర్తు చేసుకున్నాడు. భోజ్ పూరి ఇండస్ట్రీలో హీరోగాకెరీర్ స్టార్ట్ చేసి.. అక్కడ స్టార్ ఇమేజ్ సాధించాడు రవి కిషన్.. తర్వాత తెలుగు, కన్నడ, హిందీ ఇండస్ట్రీల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.