గుంటూరుకాలంలో(Gunturkaram) ఏదో జరుగుతోంది. ఈ భారీ ప్రాజెక్టును నిర్మాత నగవంశీ(Nagavamshi) ఏ ముహూర్తాన ఆ సినిమా మొదలుపెట్టారో తెలియదు కానీ ఆ సినిమా నుంచి ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారు. మంచి బజ్ ఉన్న ఈ సినిమా కేవలం డిజిటల్ హక్కులే 80 కోట్ల రూపాయలకు నెట్‌ఫ్లిక్స్‌కు అమ్ముడయ్యింది. దీనికి ఇంకా కొన్ని రైట్స్ కలిపితే నాన్ థియేటర్ హక్కులు అవుతాయి. మహేశ్‌బాబు కెరీర్‌లోనే హయ్యస్ట్..
గుంటూరుకాలంలో(Gunturkaram) ఏదో జరుగుతోంది. ఈ భారీ ప్రాజెక్టును నిర్మాత నగవంశీ(Nagavamshi) ఏ ముహూర్తాన ఆ సినిమా మొదలుపెట్టారో తెలియదు కానీ ఆ సినిమా నుంచి ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారు. మంచి బజ్ ఉన్న ఈ సినిమా కేవలం డిజిటల్ హక్కులే 80 కోట్ల రూపాయలకు నెట్‌ఫ్లిక్స్‌కు అమ్ముడయ్యింది. దీనికి ఇంకా కొన్ని రైట్స్ కలిపితే నాన్ థియేటర్ హక్కులు అవుతాయి. మహేశ్‌బాబు కెరీర్‌లోనే హయ్యస్ట్.. మరోవైపు సినిమాకు ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంది. మహేశ్‌బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ రూపొందిస్తున్న ఈ సినిమాలో మొదట పూజా హెగ్డే(Pooha Hegde), శ్రీలీలలు(sreeleela) కథనాయికలుగా ఎంపికయ్యారు. ఎమైందో ఏమో తెలియదు కానీ పూజా హెగ్డే సినిమా నుంచి ఆకస్మాత్తుగా తప్పుకున్నారు. దీంతో ప్రధాన హీరోయిన్ పాత్రను శ్రీలీలకు ఇచ్చారు. రెండో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరిని(Meenakshi chowdhary) తీసుకున్నారు. అలాగే ఈ ప్రాజెక్ట్ నుంచి సినిమాటోగ్రాఫర్ పి.ఎస్.వినోద్(PS vinodh) తప్పుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆయన ప్లేస్‌లో రవి.కె.చంద్రన్(Ravi.k.Chandran) పేరు వినిపిస్తోంది. ఇది వాస్తవమేనని పరిశ్రమలో వినిపిస్తోంది.
ఈ సినిమాకు తమన్(SS Thaman) సంగీతం అందిస్తున్నారు. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ విషయంపై కూడా ఓ షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఇదే అభిమానులను కలవరపెడుతోంది. గతంలో తమన్ స్థానంలో మరో సంగీత దర్శకుడిని తీసుకుంటున్నారని గతంలో వచ్చిన వార్తలను మూవీ మేకర్స్ ఖండించారు. తమన్ కూడా అలాంటిదేమీ లేదని చెప్పారు. కానీ లేటెస్ట్‌గా మళ్లీ ఇదే విషయంపై సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. గుంటూరు కారం సినిమా పాటలకు తమన్ ఇచ్చిన మ్యూజిక్ మహేశ్‌బాబుకు(Mahesh) నచ్చలేదట. త్రివిక్రమ్(Trivikram) చెప్పారని మాత్రమే తమన్‌ను కొనసాగిస్తున్నారట. ఇక తప్పని పరిస్థితులలో తమన్‌ను తొలగించాలని మూవీ మేకర్స్ డిసైడయ్యారట. ఇప్పుడు తమన్ ప్లేస్‌లో ఖుషీ సినిమాకు సంగీతం ఇస్తున్న హేశం అబ్దుల్ వహాబ్(Hesham Abdul Wahab), భీమ్స్ సిసిరిలియోలను(Bhims Cecilio) తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఈ విషయాన్ని మహేశ్‌బాబు ముందు పెట్టారట.. మరి దీనికి మహేశ్‌బాబు ఒప్పుకుంటారా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఇదే నిజమైతే సినిమా పాటలు మరింత హిట్ అవుతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సంగీత ద్వయంలో ఒకరు మెలోడిని సృష్టిస్తే, మరొకరు మాస్ మ్యూజిక్‌ను పుట్టిస్తారట. మెత్తంగా ఈ సినిమా నుంచి చాలా మంది టెక్నిషియన్లు తప్పుకోవడం చూస్తుంటే ఏదో తేడా కొడుతున్నట్టే అనిపిస్తోంది. త్రివిక్రమ్‌కు సినిమాటోగ్రాఫర్ వినోద్ చాలా దగ్గర. ఇద్దరూ కలిసి చాలా సినిమాలు చేశారు. అలాంటిది వినోద్ కూడా తప్పుకున్నారంటే తప్పంతా త్రివిక్రమ్‌దేనని అనిపిస్తోంది.