ప్రముఖ బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌(Raveena Tandon) రెండు మూడు తెలుగు సినిమాలలో కూడా నటించారు. బాలకృష్ణ(Balakrishna) హీరోగా వచ్చిన బంగారుబుల్లోడు(Bangaru Bullodu) సినిమాలో రమ్యకృష్ణతో(Ramyakrishna) పాటు రవీనా కూడా హీరోయిన్‌గా నటించారు. హిందీ, తెలుగుతో పాటు మరికొన్ని భాషాలలో కూడా రవీనా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.

ప్రముఖ బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌(Raveena Tandon) రెండు మూడు తెలుగు సినిమాలలో కూడా నటించారు. బాలకృష్ణ(Balakrishna) హీరోగా వచ్చిన బంగారుబుల్లోడు(Bangaru Bullodu) సినిమాలో రమ్యకృష్ణతో(Ramyakrishna) పాటు రవీనా కూడా హీరోయిన్‌గా నటించారు. హిందీ, తెలుగుతో పాటు మరికొన్ని భాషాలలో కూడా రవీనా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినిమా అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు. సినిమా షూటింగ్‌ సమయంలో ఎదురైన చేదు అనుభవాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. బాలీవుడ్‌లో లిప్‌లాక్‌ సీన్లు(Lip Kiss Scene) సర్వ సాధారణమే! అయితే రవీనా టాండన్‌ మాత్రం ముద్దు సీన్లలో నటించకూడదని డిసైడయ్యారు. తనకు తానుగా అలాంటి సన్నివేశాలలో నటించకూడదనే నిబంధన పెట్టుకున్నారు. సినిమాల్లోకి వచ్చిన తొలినాళ్లలో కాంటాక్ట్‌ లాంటివి ఏమీ లేవని, అయినా తాను ఎప్పుడూ ముద్దు సీన్స్‌లో నటించలేదని రవీనా తెలిపారు. ఆ సీన్స్‌ తనకు అసౌకర్యంగా ఉంటాయని చెప్పారు. ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్లలో జరిగిన ఓ సంఘటన ఇప్పటికీ గుర్తుందని.. ఓ సన్నివేశంలో సహనటుడి పెదవులు పొరపాటున తన పెదవులకు తగిలాయని చెబుతూ,
ఆ నటుడు కావాలని చేయలేదని, అనుకోకుండానే జరిగిందని అన్నారు. అయినప్పటికీ అది తనకు అసౌకర్యంగా అనిపించిందని, వెంటనే రూమ్‌లోకి వెళ్లానని, ఆ తర్వాత వికారంగా అనిపించి వాంతి కూడా అయ్యిందని రవీనా అన్నారు. నోటిని వందసార్లు కడుక్కుంటే బాగుండనిపించిందని చెప్పారు. అయితే, ఏ సినిమా షూటింగ్‌లో జరిగిందో, ఆ హీరో ఎవరో అన్నది మాత్రం రవీనా చెప్పలేదు.
ఆ తర్వాత హీరోకు సారీ చెప్పినట్లు రవీనా తెలిపారు. రవీనా టాండర్‌ ప్రముఖ దర్శకుడు రవి టాండర్‌ కూతురన్న విషయం తెలిసిందే కదా! సినీమాల్లోకి వచ్చేందుకు చదువుకు గుడ్‌బై చెప్పారు. 1991 లో పత్తర్‌ కే ఫూల్‌ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1993లో బాలకృష్ణ హీరోగా నటించిన ‘బంగారు బుల్లోడు’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో రథసారథి, ఆకాశవీధిలో, పాండవులు పాండవులు తుమ్మెద సినిమాల్లో నటించారు. చివరగా కేజీఎఫ్‌-2లో రమికా సేన్‌గా నటించిన రవీనా టాండన్‌ 2023లో పద్మశ్రీని అందుకున్నారు.

Updated On 29 Sep 2023 3:27 AM GMT
Ehatv

Ehatv

Next Story