బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్(Ravina Tandon)-అక్షయ్‌కుమార్(Akshay kumar) జోడి సినిమా అభిమానులను అలరించింది. నిజంగానే వారిది హిట్‌పెయిర్. మొహ్రా సినిమా సెట్స్‌లోనే ఇద్దరి చూపులు కలిశాయి. ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది. ప్రేమలో మునిగితేలారు. అయితే తమ ప్రేమను వారు సిక్రేట్‌గా ఉంచలేదు. అక్షయ్-రవీనాలు గాఢంగా ప్రేమించుకుంటున్నారన్న సంగతి అందిరికీ తెలిసిపోయింది. ఇద్దరూ పంజాబీలే. చూడటానికి జంట బాగుంది అని బాలీవుడ్ పెద్దలు కూడా అనుకున్నారు. అభిమానులు కూడా పెళ్లితో వారిద్దరు ఒక్కటైతే బాగుండని కోరుకున్నారు. అభిమానులు ఆశించినట్టుగానే వారిద్దరు తమ పెళ్లి ముచ్చటను ప్రెస్‌తో పంచుకున్నారు.
బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్(Ravina Tandon)-అక్షయ్‌కుమార్(Akshay kumar) జోడి సినిమా అభిమానులను అలరించింది. నిజంగానే వారిది హిట్‌పెయిర్. మొహ్రా సినిమా సెట్స్‌లోనే ఇద్దరి చూపులు కలిశాయి. ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది. ప్రేమలో మునిగితేలారు. అయితే తమ ప్రేమను వారు సిక్రేట్‌గా ఉంచలేదు. అక్షయ్-రవీనాలు గాఢంగా ప్రేమించుకుంటున్నారన్న సంగతి అందిరికీ తెలిసిపోయింది. ఇద్దరూ పంజాబీలే. చూడటానికి జంట బాగుంది అని బాలీవుడ్ పెద్దలు కూడా అనుకున్నారు. అభిమానులు కూడా పెళ్లితో వారిద్దరు ఒక్కటైతే బాగుండని కోరుకున్నారు. అభిమానులు ఆశించినట్టుగానే వారిద్దరు తమ పెళ్లి ముచ్చటను ప్రెస్‌తో పంచుకున్నారు. పెళ్లి తర్వాత రవీనా సినిమాలు మానేయాలని అక్షయ్ పెట్టిన కండీషన్‌కు రవీనా ఒప్పుకుంది. గృహిణిగా ఉండేందుకు మానసికంగా సిద్ధమయ్యింది కూడా! వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఇక పెళ్లి జరగడమే తరువాయి. అయితే ఆ సమయంలో అక్షయ్‌కుమార్‌పై ఇండస్ట్రీలో పలు రకాల రూమర్స్ వినిపించాయి. అతడు మరో హీరోయిన్‌కు దగ్గరయ్యాడని, ఇద్దరూ చాలా క్లోజ్‌గా ఉంటున్నారని రవీనాకు కూడా తెలిసింది. అక్షయ్ చెప్పాడని అప్పటికే సినిమాల్లో నటించడం మానేసింది. అలాంటి సమయంలో అక్షయ్‌పై ఇలాంటి కథనాలు రావడంతో రవీనా పునరాలోచనలో పడింది. అక్షయ్‌ను పెళ్లి చేసుకుంటే భవిష్యత్తులో కష్టాలు తప్పవని గ్రహించింది. అక్షయ్‌కు బ్రేకప్ చెప్పేసింది(Break up). మళ్లీ సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది. ఈ విషయాలన్నింటినీ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో(Interveiw) రవీనా చెప్పుకొచ్చారు. రూమర్స్(Rumors) స్ప్రెడ్ చేయడమనే చెడ్డ అలవాటు ఎప్పట్నుంచో ఉందని, సోషల్ మీడియా విస్తృతమయ్యాక ఇష్టానుసారంగా కథనాలు రాయడం ఎక్కువయ్యిందని రవీనా తెలిపారు. తొమ్మిదో దశకంలో ఓ పత్రిక తన అనారోగ్యాన్ని ఆత్మహత్యాయత్నంగా చెబుతూ తప్పుడు కథనాలను ప్రచురించిందని బాధపడింది. సినిమా పరిశ్రమలో తన ప్రతిష్టను దిగజార్చడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యానని రవీనా పేర్కొన్నారు. అక్షయ్‌తో బ్రేకప్ జరగడం వల్లే తాను ఆత్మహత్యకు ప్రయత్నించానంటూ తప్పుడు కథనాలు ప్రచురించిందని తెలిపింది. 'అక్షయ్‌తో బ్రేకప్ చెప్పిన సమయంలోనే నాకు బ్రెయిన్ ఫీవర్ వచ్చింది. దీంతో సుమారు 20 రోజులపాటు ఆస్పత్రిలో ఉండి చికిత్స తీసుకున్నాను. ఓ రకంగా ఆ వార్తలతో నా సినిమా కెరియర్ కూడా దెబ్బతింది. నేను ఆత్మహత్య చేసుకునేంత పిరికిదానిని కాదు. జీవితంలో పోరాడే రకం' అని రవీనా చెప్పుకొచ్చారు. తొమ్మిదో దశకంలో నటీ నటుల మధ్య పోటీ చాలా ఎక్కువగానే ఉండేదని, సెట్లో హీరోహీరోయిన్ల నటన, అఫైర్లు, వివాదాల గురించి చెప్పుకుంటూ సరదాగ అందరం మాట్లాడుకునే వాళ్లమని రవీనా అన్నారు. కాకపోతే కొన్నిసార్లు ఇది శ్రుతి మించి పోయే సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. ఎవరైతే తమ కెరీర్ పట్ల అభద్రతా భావంతో ఉంటారో వారందరూ కూడా ఇతరుల విజయాన్ని ఓర్వలేకపోయేవాళ్లని, అలాంటి వారిలో కొందరు ఇతర నటీమణులను కిందికి లాగాలని ప్రయత్నించేవారని తెలిపారు. అందుకోసం వాళ్ల బాయ్‌ఫ్రెండ్ లేదా గర్ల్‌ఫ్రెండ్‌ని ఇతరులపై ప్రయోగించేవారని, ఇలాంటి పరిస్థితి తాను కూడా ఎదుర్కొన్నానని వివరించారు. 'అలాంటి వారి వల్ల తాను కూడా అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాను. అయితే నాకు తెలిసి ఉద్దేశపూర్వకంగా ఎవరి అవకాశాలను నేను నిలువరించలేదు. ఎవరి మనసును గాయపరచలేదు. ఎవరినీ సినిమాలోంచి తీసేయించాలని అనుకోలేదు. నాకు తెలియకుండా అలా జరిగి ఉంటే క్షమాపణ చెప్పడానికి ఇప్పటికీ నేను రెడీ’ అని రవీనా చెప్పారు. 2004లో రవీనా టాండన్ బిజినెస్‌మెన్ అనిల్ తడానీని పెళ్లి చేసుకుంది. వీరికి రాశా, రణ్‌బీర్ వర్దన్ అనే పిల్లలున్నారు. పెళ్లికి చాన్నాళ్ల ముందే అంటే 1995లోనే పూజ, ఛాయ అనే ఇద్దరు చిన్నారులను రవీనా దత్తత తీసుకున్నారు. తన పిల్లల దగ్గర తన అఫైర్ల గురించి ఏదీ దాచలేదు. ప్రతీది వారికి చెప్పానని రవీనా తెలిపారు.