బిగ్‌బాస్ ఏడో సీజన్‌ను(Bigg Boss Season 7) వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఆ రియాల్టీ షోలో ఊహించనిది జరిగింది. టైటిల్‌ను సాధిస్తుందని అందరూ అనుకున్న రతిక(Rathika) అనుకోకుండా ఎలిమినేట్ అయిపోయింది. ఓట్లు తక్కువగా రావడంతో నాలుగో వారమే బిగ్‌బాస్‌హౌస్ నుంచి బయటకొచ్చేసింది. అయితే బయటకు వస్తున్నప్పుడు రతిక కన్నీళ్లు పెట్టుకుంది.
బిగ్‌బాస్ ఏడో సీజన్‌ను(Bigg Boss Season 7) వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఆ రియాల్టీ షోలో ఊహించనిది జరిగింది. టైటిల్‌ను సాధిస్తుందని అందరూ అనుకున్న రతిక(Rathika) అనుకోకుండా ఎలిమినేట్ అయిపోయింది. ఓట్లు తక్కువగా రావడంతో నాలుగో వారమే బిగ్‌బాస్‌హౌస్ నుంచి బయటకొచ్చేసింది. అయితే బయటకు వస్తున్నప్పుడు రతిక కన్నీళ్లు పెట్టుకుంది. హౌస్‌లో ఉడాలని ఆమె ఎంతగానో ఆశించింది. ఆ ఆశ నెరవేరపోవడంతో ఆమె బాధపడింది. తప్పని పరిస్థితులలో ఆమె బయటకు వచ్చేసింది. మొదటివారం నుంచి కెమెరాలు తనపై ఫోకస్ అయ్యేలా చేసుకున్న రతిక ఆ విషయంలో మాత్రం సక్సెస్ అయ్యింది. కాకపోతే గేమ్స్, టాస్కుల విషయానికి వచ్చేసరికి తేలిపోయింది. ఎందులోనూ సక్సెస్ కాలేకపోయింది. రెండో వారం వచ్చేసరికి రతిక సొంత టీమ్ సభ్యులనే బఫూన్స్ అని కామెంట్ చేసింది. ఇది కాసింత చర్చనీయాంశమయ్యింది.
బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంటరయ్యిన రెండు రోజుల్లోనే రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌తో దగ్గరయ్యింది. వీరిద్దరు ప్రేమలో పడ్డారనే గుసగుసలు వినిపించాయి. వారి ప్రవర్తన కూడా అలాగే ఉండింది. రెండో వారానికి వచ్చేసరికి సీన్ మారిపోయింది. యవర్‌తో ప్రేమవంటి వ్యవహారం కూడా బెడిసికొట్టింది. ప్రశాంత్(Prashant), యవర్‌తో(Yavar) క్లోజ్‌గా ఉంటూనే వాళ్లకు వెన్నుపోటు పొడిచింది. ఇది ఆమె గేమ్ ప్లాన్‌లా భావిస్తే భావించవచ్చుగాక, ప్రేక్షకులకు మాత్రం నచ్చలేదు. అందుకే ఆమెను ఎలిమినేట్ చేసేశారు. నాలుగో వారం ఎలిమినేట్ అయిన రతిక.. ప్రతివారం రెండు లక్షల రూపాయల చొప్పున అంటే నాలుగు వారాలకు కలిపి ఎనిమిది లక్షల రూపాయలను సొంతం చేసుకుందని సమాచారం. అంటే నెల రోజుల్లో ఆమె ఎనిమిది లక్షల రూపాయలు సంపాదించిందన్నమాట! మొత్తం మీద టైటిల్ ఫేవరెట్ అనుకున్న ఈ అందాలభామ, ఇంత త్వరగా ఎలిమినేట్ అయినప్పటికీ రెమ్యునరేషన్(Remuneration) మాత్రం బాగానే అందుకున్నారు.