మీర్జాపూర్‌(Mirzapur) వెబ్‌ సిరీస్‌ ఎంతటి విజయాన్ని సాధించిందో చెప్పాల్సిన పని లేదు. రెండూ సీజన్లు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. అసలు ఓటీటీల్లోని(OTT) వెబ్‌ సిరీస్‌లంటే చాలు అందరికీ ముందు గుర్తుకొచ్చేది మీర్జాపూరే! ఇందులో బూతులు ఎక్కువగా ఉన్నాయని కొందరు విమర్శించినా చాలా మందికి తెగ నచ్చేసింది.
మున్నా భయ్యా(Munna Bhai,), గుడ్డూ భయ్యా(Gudu Bhai) పాత్రలు వాళ్లు చెప్పిన డైలాగ్స్ చాలామంది ఇప్పటికీ గుర్తు తెచ్చుకుంటుంటారు.

మీర్జాపూర్‌(Mirzapur) వెబ్‌ సిరీస్‌ ఎంతటి విజయాన్ని సాధించిందో చెప్పాల్సిన పని లేదు. రెండూ సీజన్లు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. అసలు ఓటీటీల్లోని(OTT) వెబ్‌ సిరీస్‌లంటే చాలు అందరికీ ముందు గుర్తుకొచ్చేది మీర్జాపూరే! ఇందులో బూతులు ఎక్కువగా ఉన్నాయని కొందరు విమర్శించినా చాలా మందికి తెగ నచ్చేసింది.
మున్నా భయ్యా(Munna Bhai,), గుడ్డూ భయ్యా(Gudu Bhai) పాత్రలు వాళ్లు చెప్పిన డైలాగ్స్ చాలామంది ఇప్పటికీ గుర్తు తెచ్చుకుంటుంటారు. ఆ వెబ్‌ సిరీస్‌ ఫ్యాన్స్‌ అంతా మూడో సీజన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు బీనా ఆంటీ(Beena Aunty) అప్‌డేట్‌తో వచ్చేసింది. బీనా ఆంటీ పాత్రను అద్భుతంగా పోషించారు రసికా దుగల్‌(Rasika Dugal). 2018లో అమెజాన్‌ ప్రేమ్‌లో మీర్జాపుర్ తొలి సీజన్ విడుదలయ్యింది. తొమ్మిది ఎపిసోడ్‌లలో ప్రతి ఒక్కటి ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించాయి.

2020లో పది ఎపిసోడ్‌లతో రెండో సీజన్ వచ్చింది. దీనికి కూడా మొదటి దానికి మించిన ఆదరణ లభించింది. దీంతో మూడో సీజన్ ఎప్పుడొస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. చాలారోజుల క్రితమే షూటింగ్ పూర్తయినప్పటికీ రిలీజ్ ఇంకా ఫిక్స్ చేయలేదు. ఈ సిరీస్ లో మున్నా భయ్యా, గుడ్డు భయ్యా, ఖాలీన్ భయ్యా పాత‍్రల తర్వాత ఆ స్థాయి క్రేజ్ తెచ్చుకున్నపాత్ర బీనా అంటీదే. ఈమెది ఖాలీన్ భయ్యాకు రెండో భార్య పాత్ర. ఒకటి, రెండు సీజన్లలో ఈమె పాత్రకు స్కోప్ తక్కువే. కానీ మూడో సీజన్ లో మాత్రం ఎక్కువే ఉండబోతుందని హింట్ ఇచ్చారు మేకర్స్‌. ఇప్పుడు డబ్బింగ్ చెబుతున్న ఫొటోని పోస్ట్ చేసి.. త్వరలోనే మీర్జాపూర్‌ సీజన్ 3 విడుదల అవుతుందనే హింట్ ఇచ్చేశారు. . దీంతో 'మీర్జాపుర్' ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు

Updated On 13 July 2023 5:03 AM GMT
Ehatv

Ehatv

Next Story