అల్లు అర్జున్‌(Allu arjun) అభిమానులే కాదు, సినీ ఫ్యాన్స్‌ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2(Pushpa-2).

అల్లు అర్జున్‌(Allu arjun) అభిమానులే కాదు, సినీ ఫ్యాన్స్‌ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2(Pushpa-2). మరికొద్ది రోజుల్లో ఈ సినిమా థియేటర్లలో రాబోతున్నది. ఇప్పటికే ప్రమోషన్స్‌ మొదలయ్యాయి. దేశ వ్యాప్తంగా భారీ ఈవెంట్‌లను జరపబోతున్నారు. ఈ సినిమాలో కూడా అల్లు అర్జున్‌ సరసన రష్మిక మందన్నా(Rashmika Mandanna) నటిస్తున్నది. పుష్ప 2 విడుదల సందర్భంగా అల్లు అర్జున్‌కు ఆమె ఓ మంచి కానుకను(Gift) పంపించారు. అల్లు అర్జున్‌కు అంతా మంచే జరగాలని ఆమె మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓ చక్కటి బహుమతిని ఇచ్చారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్‌ స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా తెలిపాడు. రష్మిక ఏం ఇచ్చారంటే ఓ వెండి వస్తువును, దాంతో పాటు ఓ స్పెషల్‌ నోట్‌ను. 'మ‌నం ఎవరికైనా వెండి బహుమతిగా ఇస్తే వాళ్లకు అదృష్టం కలిసొస్తుందని మా అమ్మ తరచుగా చెబుతుంది. ఈ చిన్న వెండి వస్తువు, స్వీట్స్.. మీకు మరింత అదృష్టం తీసుకొస్తుందని అనుకుంటున్నాను. మీకు, మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు' అంటూ ఆ నోట్‌లో రాసుకొచ్చారు రష్మిక మందన్నా. ఈ నోట్‌ను అల్లు అర్జున్‌ షేర్‌ చేస్తూ.. థాంక్యూ మై డియర్‌.. ఇప్పుడు మరెంతో అదృష్టం కావాలి అని రాసుకొచ్చారు.

Eha Tv

Eha Tv

Next Story