పుష్ప(Pushpa) సినిమాతో రష్మిక మందన్న(Rashmika Mandanna) నేషనల్‌ క్రష్‌గా(National Crush) మారారు. అప్పటి వరకు దక్షిణాదికే పరిమితమైన ఆమె క్రేజ్‌ దేశమంతటా విస్తరించింది. ఆ సినిమాతో బాలీవుడ్‌లో(Bollywood) కూడా అవకాశాలు రావడం మొదలయ్యాయి. కర్ణాటకు(Karnataka) చెందిన అందాల భామ రష్మిక మందన్నలో మల్టిపుల్ టాలెంట్‌ ఉంది.

పుష్ప(Pushpa) సినిమాతో రష్మిక మందన్న(Rashmika Mandanna) నేషనల్‌ క్రష్‌గా(National Crush) మారారు. అప్పటి వరకు దక్షిణాదికే పరిమితమైన ఆమె క్రేజ్‌ దేశమంతటా విస్తరించింది. ఆ సినిమాతో బాలీవుడ్‌లో(Bollywood) కూడా అవకాశాలు రావడం మొదలయ్యాయి. కర్ణాటకు(Karnataka) చెందిన అందాల భామ రష్మిక మందన్నలో మల్టిపుల్ టాలెంట్‌ ఉంది. ఆమె కేవలం నటనకే పరిమితం కాలేదు. టైమ్‌ దొరికినప్పుడల్లా ఇంగ్లీషులో కవితలు(Poems) రాస్తూ ఉంటారు. అంతేనా.. ఆరు భాషలలో(6 Languages) అనర్గళంగా మాట్లాడగలరు. ఇటీవల షూటింగ్‌ విరామంలో సోషల్‌ మీడియా(Social media) ద్వారా అభిమానులతో మాట్లాడారు రష్మిక. వారు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో జవాబులిచ్చారు. వివిధ ప్రాంతాలకు చెందిన అభిమానులు తమ మాతృభాషల్లోనే ప్రశ్నలు అడిగారు. రష్మిక కూడా వారి భాషలోనే బదలిస్తూ తన భాషా ప్రావీణ్యాన్ని చాటుకున్నారు.

ఈ సందర్భంగా తన వ్యక్తిగత విషయాలను, తన అభిరుచులను అభిమానులతో(Fans) పంచుకున్నారు. కర్ణాటక కూర్గ్‌(Coorg) పట్టణంలో ఉన్న తన నివాసం అంటే తనకు ఎంతో ఇష్టమని, ఈ భూమ్మీద అత్యంత ఇష్టమైన ప్రదేశం అదేనని రష్మిక తెలిపారు. నటన మీద మక్కువతోనే వివిధ భాషలను నేర్చుకున్నానని, అభిమానులతో వారి సొంత భాషలో మాట్లాడటం వారికిచ్చే నిజమైన గౌరవంగా భావిస్తానని రష్మిక మందన్న చెప్పారు. తాను ఆరు భాషలలో మాట్లాడగలనన్నారు. 'నేను హైదరాబాద్‌ వాళ్లతో మాట్లాడేటప్పుడు నమస్తే బాగున్నారా అని పలకరిస్తాను. ఒక రాష్ట్రంలో పనిచేస్తున్నప్పుడు అక్కడి భాషను నేర్చుకోవడం తప్పనిసరైన విషయంగా నేను భావిస్తాను ' అని రష్మిక మందన్న చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ అందాల సుందరి పుష్ప-2(Pushpa-2), యానిమల్‌(Animal), రెయిన్‌ బో(Rainbow) చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్నారు.

Updated On 12 July 2023 4:01 AM GMT
Ehatv

Ehatv

Next Story