నేషనల్‌ క్రష్‌ స్టార్‌ హీరోయిన్‌ రష్మిక(Rashmika) వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. బాలీవుడ్‌లోనూ ఆమెకు ఆఫర్లు వస్తున్నాయి. పుష్ప(Pushpa) సినిమాతో ఆమె క్రేజ్‌ దేశమంతటా వ్యాపించింది. కోట్లాది మంది అభిమానుల మనసులను కొల్లగొట్టిన రష్మిక మనసులో ఎవరున్నారు? ఇంకెవరు విజయ్‌ దేవరకొండనే(Vijay Devarkonda) అని చాలా మంది ఫ్యాన్స్‌ అంటారు.

నేషనల్‌ క్రష్‌ స్టార్‌ హీరోయిన్‌ రష్మిక(Rashmika) వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. బాలీవుడ్‌లోనూ ఆమెకు ఆఫర్లు వస్తున్నాయి. పుష్ప(Pushpa) సినిమాతో ఆమె క్రేజ్‌ దేశమంతటా వ్యాపించింది. కోట్లాది మంది అభిమానుల మనసులను కొల్లగొట్టిన రష్మిక మనసులో ఎవరున్నారు? ఇంకెవరు విజయ్‌ దేవరకొండనే(Vijay Devarkonda) అని చాలా మంది ఫ్యాన్స్‌ అంటారు. గత కొన్నాళ్లుగా రష్మిక- విజయ్‌ దేవరకొండ మధ్య సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ ఉందంటూ సోషల్‌ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వీరిద్దరు కలిసి చేసింది కేవలం రెండు సినిమాలే అయినా ఈ కాంబినేషన్‌కు వచ్చిన క్రేజ్‌ అంతా ఇంతా కాదు. అయితే ప్రేమ గురించి, పెళ్లి గురించి ఎన్ని వదంతులు వచ్చినప్పటికీ అటు రష్మిక కానీ, ఇటు విజయ్‌ దేవరకొండ కానీ ఇప్పటి వరకు రియాక్టవ్వలేదు. తాజాగా ఓ ఈవెంట్‌లో రష్మిక మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

కర్ణాటకకు చెందిన అందాల భామ రష్మిక కన్నడ సినిమా కిరిక్‌ పార్టీతో హీరోయన్‌గా పరిచయమయ్యారు. సొంత భాషలో మరో సినిమాలో నటిస్తున్నప్పుడే తెలుగులో ఛలో సినిమా అవకాశం వచ్చింది. ఇది హిట్‌ అవ్వడంతో ఈమెకు టాలీవుడ్‌లో గుర్తింపు వచ్చింద. అలా యంగ్‌ హీరోలతో సినిమాలు చేసిన రష్మిక .. మహేశ్‌బాబుతో సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్‌తో పుష్ప సినిమాలతో హిట్‌ కొట్టి స్టార్‌ హీరోయిన్‌ అయ్యారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉన్నారు. కొన్ని రోజుల ముందు ఓ ప్రమోషనల్‌ ఈవెంట్‌కు టైగర్‌ ష్రాఫ్‌తో(Tiger shroff) కలిసి వెళ్లారు. ఇందులో భాగంగా హోస్ట్ ఓ ప్రశ్న వేశారు. దానికి జవాబుగా 'నాకు నరుటోతో ఆల్రెడీ పెళ్లయిపోయింది. నా మనసులో అతడే ఉన్నాడు' అని రష్మిక ఫన్నీ కామెంట్స్‌ చేశారు. నరుటో(Naruto) అనేది ఫేమస్‌ అయిన ఎనిమీ(Anime) సిరీస్‌లో ఓ పాత్ర పేరు. వీటికి ప్రత్యేక అభిమానులు ఉంటారు. అందులో రష్మిక ఒకరు. ఇప్పుడు ఈమె నరుటో గురించి మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న రష్మిక హిందీలో సందీప్ రెడ్డి వంగా యానిమల్‌(animal)తోపాటు రెయిన్ బో అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ కూడా చేస్తున్నారు. తెలుగులో నితిన్‌తోనూ ఓ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఇందులో నుంచి ఆమె తప్పుకుందనే రూమర్స్ వచ్చాయి గానీ ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.

Updated On 3 Aug 2023 4:51 AM GMT
Ehatv

Ehatv

Next Story