నటి రష్మిక మందన్నా(Rashmika mandanna) మరోసారి డీప్‌ ఫేక్‌కు(Deep Fake Video) బలయ్యారు. ఇంతకు ముందు కూడా రష్మికకు సంబంధించిన ఫేక్‌ వీడియో వైరల్‌ అయ్యింది. దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. అమితాబ్‌ బచ్చన్‌తో పాటు చాలా మంది సెలెబ్రిటీలు దీనిపై స్పందించారు. ఇలాంటివి చేసిన వారిని శిక్షించాలని డిమాండ్‌ చేశారు. అ నేపథ్యంలో పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్‌ అయ్యింది.

నటి రష్మిక మందన్నా(Rashmika mandanna) మరోసారి డీప్‌ ఫేక్‌కు(Deep Fake Video) బలయ్యారు. ఇంతకు ముందు కూడా రష్మికకు సంబంధించిన ఫేక్‌ వీడియో వైరల్‌ అయ్యింది. దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. అమితాబ్‌ బచ్చన్‌తో పాటు చాలా మంది సెలెబ్రిటీలు దీనిపై స్పందించారు. ఇలాంటివి చేసిన వారిని శిక్షించాలని డిమాండ్‌ చేశారు. అ నేపథ్యంలో పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్‌ అయ్యింది. ఇలాంటి ఫేక్‌ వీడియాలు క్రియేట్‌ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది కూడా! డీప్‌ ఫేక్‌ టెక్నాలజీ వల్ల జరుగుతున్న మేలేమిటో తెలియదు కానీ సెలెబ్రెటీలకు మాత్రం శాపంగా మారింది. మంచి కంటే చెడు పనులకే ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. సినిమా పరిశ్రమకు చెందిన నటీనటులకు సంబంధించిన ఫేక్‌ వీడియోలు తయారు చేసి వాటిని సోషల్‌ మీడియాలో వైరల్ చేస్తున్నారు. రష్మికతో పాటు కాజోల్‌(Kajol), కత్రినా కైఫ్‌(Katrina kaif) లు కూడా డీప్‌ ఫేక్‌ బారిన పడ్డారు. ఇప్పుడు మరోసారి రష్మిక డీప్‌ఫేక్‌ బారిన పడ్డారు. ఆమెకు సంబంధించిన ఓ ఫేక్‌ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. రష్మిక అసభ్యకరంగా డ్యాన్స్‌ చేస్తున్నట్టుగా క్రియేట్‌ చేశారు. డ్యాన్స్‌ చేస్తున్న ఓ యువతి ముఖాన్ని ఎడిట్‌ చేసి రష్మిక ముఖాన్ని పెట్టారు. ఇలాంటి ఫేక్‌ వీడియోలు క్రియేట్‌ చేయకూడదంటూ ఫ్యాన్స్‌ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. .

Updated On 12 March 2024 6:45 AM GMT
Ehatv

Ehatv

Next Story